Breaking News

చెలరేగిన హెన్రీ.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన న్యూజిలాండ్‌

Published on Wed, 07/16/2025 - 20:52

జింబాబ్వేలో జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. బుధవారం హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో సౌతాఫ్రికాను 21 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.

కివీస్‌ ఓపెనర్లు సీఫర్ట్‌(22), ​కాన్వే(9) ఆరంభంలోనే ఔటయ్యారు. ఆ తర్వాత సీనియర్‌ బ్యాటర్‌ డార్లీ మిచెల్‌(5), వికెట్‌ కీపర్‌ హే(5) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే వెనుదిరిగారు. ఈ సమయంలో టిమ్ రాబిన్సన్(75), డెవాన్‌ జాకబ్స్‌(44).. ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 105 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. సౌతాఫ్రికా బౌలర్లలో మఫాక రెండు, ఎంగిడీ, ముత్తుసామి, కోట్జీ తలా వికెట్‌ సాధించారు.

అనంతరం లక్ష్య చేధనలో సౌతాఫ్రికా 18.2 ఓవర్లలో 152 పరుగులకే కుప్ప​కూలింది. ప్రోటీస్‌ బ్యాటర్లలో బ్రెవిస్‌(35) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. లిండే(30), ప్రిటోరియస్‌(27) పర్వాలేదన్పించారు. కివీస్‌ బౌలర్లలో మాట్‌ హెన్రీ, జాకబ్‌ డఫీ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సోధీ రెండు, శాంట్నర్‌ ఓ వికెట్‌ సాధించారు.
చదవండి: Virat kohli: చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయ‌ర్‌గా

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)