Breaking News

ద‌క్షిణాఫ్రికా పొమ్మంది.. న్యూజిలాండ్ ర‌మ్మంది

Published on Fri, 06/06/2025 - 12:19

న్యూజిలాండ్ సీనియర్‌ పురుషుల క్రికెట్‌ జట్టు ఆల్‌ ఫార్మాట్‌ హెడ్‌ కోచ్‌గా సౌతాఫ్రికాకు చెందిన‌ రాబ్ వాల్టర్ నియ‌మితుడ‌య్యాడు. గ‌త నెల‌లో ప్ర‌ధాన కోచ్ ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్న గ్యారీ స్టెడ్ స్ధానాన్ని వాల్టర్ భ‌ర్తీ చేయ‌నున్నాడు. 2028 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ వ‌ర‌కు అత‌డు ఈ పదవిలో కొన‌సాగ‌నున్నాడు.

ఈ విష‌యాన్ని న్యూజిలాండ్ న్యూజిలాండ్ క్రికెట్ (NZC) శుక్ర‌వారం ధ్రువీక‌రించింది. ఈ ఏడాది జూలైలో జింబాబ్వేతో జ‌ర‌గ‌నున్న వైట్‌బాల్ సిరీస్‌ల‌తో వాల్టర్ కివీస్ కోచ్‌గా త‌న ప్ర‌యాణాన్ని ప్రారంభించ‌నున్నాడు. కాగా కోచ్‌గా వాల్ట‌ర్‌కు అపార‌మైన అనుభ‌వం ఉంది. మొన్న‌టివ‌ర‌కు సౌతాఫ్రికా వైట్‌బాల్‌ జ‌ట్టు ప్ర‌ధాన కోచ్‌గా రాబ్‌ ప‌నిచేశాడు. 

అత‌డి నేతృత్వంలోనే టీ20 ప్రపంచకప్‌-2024 ఫైనల్‌కు ప్రోటీస్ జట్టు దూసుకెళ్లింది. అయినప్పటికి అతడి కాంట్రాక్ట్‌ను సౌతాఫ్రికా క్రికెట్‌ పొడిగించలేదు. అతడి స్ధానంలో ఆల్‌ ఫార్మాట్‌ హెడ్‌ కోచ్‌గా షుక్రి కాన్రాడ్‌ను సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. 

న్యూజిలాండ్ డిమాస్టిక్ క్రికెట్‌లో కూడా వాల్టర్ ఒటాగో వోల్ట్స్‌కు కోచ్‌గా పనిచేశాడు. 2018-19, 2019-20లో వరుసగా ఫోర్డ్ ట్రోఫీ ఫైనల్స్‌లకు ఒటాగోనే వాల్టర్ చేర్చాడు. పూణే వారియర్స్,  ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా కూడా తన సేవలను అందించాడు.
చదవండి: Shubman Gill: కోహ్లి, రోహిత్ ఉన్నా లేకున్నా ఒకేలా ఉంటుంది
 

#

Tags : 1

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)