Breaking News

RR Vs LSG: అన్న ఇది నీవేనా.. మేము అస్స‌లు ఊహించ‌లేదు! వీడియో వైర‌ల్‌

Published on Sun, 03/24/2024 - 19:00

ఐపీఎల్‌లో గత కొన్ని సీజ‌న్ల‌గా త‌న ఆట తీరుతో విమ‌ర్శ‌లు మూట‌గట్టుకుంటున్న రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఆట‌గాడు రియాన్ ప‌రాగ్ ఎట్ట‌కేల‌కు బ్యాట్‌ను ఝులిపించాడు. ఐపీఎల్‌-2024లో భాగంగా జైపూర్ వేదిక‌గా లక్నో సూప‌ర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో  ప‌రాగ్ అద‌ర‌గొట్టాడు. నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన ప‌రాగ్ త‌న‌ అద్బుత‌మైన ఇన్నింగ్స్‌తో అంద‌ర‌ని ఆక‌ట్టుకున్నాడు.

కెప్టెన్ సంజూ శాంస‌న్‌తో క‌లిసి త‌న జ‌ట్టుకు భారీ స్కోర్‌ను అందించాడు. 29 బంతులు ఎదుర్కొన్న రియాన్‌.. ఒక ఫోర్‌, 3 సిక్స్‌ల‌తో 43 ప‌రుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఇది చూసిన నెటిజ‌న్లు అన్న ఇది నీవేనా..  అస్స‌లు ఊహించ‌లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా 2019లో ఐపీఎల్‌లో రాజ‌స్తాన్‌ డెబ్యూ చేసిన రియాన్ పరాగ్.. ఇప్పటివరకు 55 మ్యాచులు ఆడాడు. వాటిల్లో 643 పరుగులు స్కోర్ చేశాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. 

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.  రాజ‌స్తాన్ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ సంజూ శాంసన్‌ (52 బంతుల్లో 82 నాటౌట్‌; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుప‌డ్డాడు. శాంసన్‌తో పాటు రియాన్‌ పరాగ్‌ (43) కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. ల‌క్నో బౌల‌ర్ల‌లో న‌వీన్ ఉల్ హ‌క్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ర‌వి బిష్ణోయ్‌, మోహ్సిన్ ఖాన్ త‌లా వికెట్ ప‌డ‌గొట్టారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)