Breaking News

చేసింది 25 పరుగులే.. అయినా టీమిండియాలో ఛాన్స్‌! అస్సలు కారణమిదే?

Published on Thu, 07/25/2024 - 18:05

శ్రీలంక‌తో ప‌రిమిత ఓవ‌ర్ల సిరీస్‌ల‌కు టీమిండియా సిద్ద‌మైంది. లంక ప‌ర్య‌ట‌న‌లో భాగంగా భార‌త జ‌ట్టు మూడు టీ20లు, మూడు వ‌న్డేల సిరీస్‌లు ఆడ‌నుంది. జూలై 27 జ‌ర‌గ‌నున్న తొలి టీ20తో భార‌త ప‌ర్య‌ట‌న ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తో భార‌త కెప్టెన్‌గా సూర్య‌కుమార్ యాద‌వ్, హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్‌ల ప్ర‌స్ధానం మొద‌లు కానుంది. 

ఇప్ప‌టికే ఆతిథ్య దేశానికి చేరుకున్న భార‌త జ‌ట్టు గంభీర్ నేతృత్వంలో తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే శ్రీలంకతో టీ20, వన్డేలకు భారత జట్టులో యువ ఆటగాడు రియాన్ పరాగ్‌కు చోటు దక్కడం అందరిని ఆశ్యర్యపరిచింది.

జింబాబ్వే టీ20 సిరీస్‌తో అరంగేట్రం చేసిన పరాగ్‌.. తన మార్క్‌ను చూపించలేకపోయాడు. దారుణంగా విఫలమై విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినప్పటకి సెలక్టర్లు ఏ ప్రాతిపాదికన అతడిని లంక టూర్‌కు ఎంపిక చేశారని పెద్ద ఎత్తున ఇప్పటికి చర్చనడుస్తోంది. కాగా తాజాగా ఇదే విషయంపై టైమ్స్ ఆఫ్ ఇండియా ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. 

టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. శ్రీలంకతో వైట్‌బాల్ సిరీస్‌లకు తొలుత హైదరాబాదీ తిలక్ వర్మను ఎంపిక చేయాలని సెలక్టర్లు భావించారట. కానీ తిలక్ వర్మ గాయపడటంతో పరాగ్‌ను అతడి స్ధానంలో పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం.

"పరాగ్ చాలా టాలెంటడ్‌. అతడికి అద్భుతమైన ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్నాయి.  ఆఫ్ ది ఫీల్డ్‌, ఆన్ ది ఫీల్డ్ తన వైఖరిని కూడా మార్చుకున్నాడు. చాలా విషయాల్లో అతడు మెరుగయ్యాడు. ఇప్పడు  అతడి ఆట తీరు పూర్తిగా మారిపోయింది. 

క్రీజులో నిలదొక్కకునే ప్రయత్నం చేస్తున్నాడు. పరాగ్ అద్భుతమైన ఫీల్డర్ కూడా. అయితే సెలక్టర్ల దృష్టిలో పరాగ్ కం‍టే ముందు తిలక్ వర్మ ఉండేవాడు. కానీ అతడి గాయపడటం రియాన్‌కు మార్గం సుగమమైందని" బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో వెల్లడించాయి. కాగా జింబాబ్వే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన పరాగ్ కేవలం 25 పరుగులు మాత్రమే చేశాడు.

భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్ (వైస్ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, రింకు సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్‌), సంజు శాంసన్ (వికెట్ కీపర్‌), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఖలీల్ అహ్మద్, మొహమ్మద్. సిరాజ్.

భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్ (వైస్‌ప్టెన్‌), విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్‌), రిషబ్ పంత్ (వికెట్ కీపర్‌), శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్. సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్‌ సింగ్‌, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)