Breaking News

IPL 2025: చ‌రిత్ర సృష్టించిన రియాన్ పరాగ్‌.. ఐపీఎల్ హిస్టరీలోనే

Published on Sun, 05/04/2025 - 20:51

ఐపీఎల్‌-2025లో ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జ‌రిగిన ఉత్కంఠ‌పోరులో ఒక్క ప‌రుగు తేడాతో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఓట‌మి పాలైంది. 207 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన రాజ‌స్తాన్.. ఆఖ‌రి బంతి వ‌ర‌కు పోరాడింది. చివ‌రి ఓవ‌ర్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ విజ‌యానికి 22 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌వ్వ‌గా.. శుభ‌మ్ దూబే వ‌రుస‌గా బౌండరీలు బాది గెలుపున‌కు చేరువ చేశాడు.

కానీ ఆఖ‌రి బంతికి నాన్‌స్ట్రైక్‌లో జోఫ్రా అర ర‌నౌట్ కావ‌డంతో రాజ‌స్తాన్ ఓట‌మి చ‌విచూడాల్సి వ‌చ్చింది. అయితే ఈ మ్యాచ్‌లో రాయ‌ల్స్ ఓట‌మి పాలైన‌ప్ప‌టికి.. ఆ జ‌ట్టు కెప్టెన్ రియాన్ ప‌రాగ్ త‌న అద్బుత ఇన్నింగ్స్‌తో అంద‌రిని ఆక‌ట్టుకున్నాడు. ఓ దశ‌లో రాజ‌స్తాన్‌ను ఈజీగా గెలిపించేలా క‌న్పించిన ప‌రాగ్‌.. కీల‌క స‌మ‌యంలో ఔట్ కావ‌డంతో మ్యాచ్ ఫ‌లితం తారుమారైంది. 

పరాగ్ తృటిలో తొలి ఐపీఎల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 45 బంతులు ఎదుర్కొన్న ప‌రాగ్‌.. 6 ఫోర్లు, 8 సిక్స్‌ల‌తో 95 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో ప‌రాగ్ వ‌రుస ఆరు సిక్స‌ర్లు బాది సంచ‌ల‌నం సృష్టించాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన స్పిన్నర్ మోయిన్ అలీ బౌలింగ్‌లో తొలి బంతికి షిమ్రన్‌ హెట్‌మెయిర్ సింగిల్ తీసి పరాగ్‌కు స్టైక్ ఇచ్చాడు. 

ఆ తర్వాతి ఐదు బంతులను రియాన్ సిక్సర్లగా మలిచాడు. ఆ తర్వాత 14 ఓవర్ తొలి బంతికి ఓ పరుగు తీసి మళ్లీ పరాగ్‌కు స్ట్రై​క్ ఇచ్చాడు. పరాగ్ ఆ బంతిని కూడా స్టాండ్స్‌లోకి పంపించాడు. దీంతో వరుసగా తను ఎదర్కొన్న ఆరు బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో వరుసగా ఆరు సిక్స్‌లు బాదిన తొలి ప్లేయర్‌గా పరాగ్ రికార్డులకెక్కాడు.
చ‌ద‌వండి: ఒక్క పరుగు.. ఒకే ఒక్క పరుగు.. హృదయం ముక్కలైంది!


 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)