IND vs NZ: భారత్‌కు భారీ షాక్‌! కివీస్‌ సిరీస్‌ నుంచి స్టార్‌ ప్లేయర్‌ ఔట్‌?

Published on Fri, 10/18/2024 - 09:41

బెంగ‌ళూరు వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో టీమిండియాకు భారీ షాక్ త‌గిలింది. రెండో రోజు ఆట‌లో గాయ‌ప‌డ్డ స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌బ్ పంత్.. మూడో రోజు ఆట‌కు దూర‌మ‌య్యాడు.

అత‌డి గాయం తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే మూడో రోజు ఆటకు పంత్ మైదానంలో అడుగుపెట్ట‌లేదు. అత‌డి స్ధానంలో ధ్రువ్ జురెల్ స‌బ‌స్ట్యూట్ వికెట్ కీప‌ర్‌గా కొన‌సాగుతున్నాడు.

ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. "పంత్‌ ప్రస్తుతం మా వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. మూడో రోజు అతడు వికెట్‌ కీపింగ్‌కు దూరంగా ఉండనున్నాడని" బీసీసీఐ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది.

అసలేం జ‌రిగిందంటే?
కివీస్ ఇన్నింగ్స్ 37వ ఓవర్లో రవీంద్ర జడేజా వేసిన బంతిని కివీస్‌ బ్యాటర్‌ డెవాన్‌ కాన్వే షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ క్ర‌మంలో బాల్‌ ఆఫ్‌ స్టంప్‌ మీదుగా వచ్చి పంత్‌ మెకాలికి బలంగా తాకింది. 

దీంతో అతడు నొప్పితో విలవిల్లాడుతూ మైదానాన్ని వీడాడు. అయితే తొలి రోజు ఆట అనంత‌రం భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ పంత్ గాయంపై అప్‌డేట్ ఇచ్చాడు. ఇటీవ‌ల సర్జరీ చేయించుకున్న మోకాలికే గాయం అయిందని, మేం ఎలాంటి రిస్క్ తీసుకోలేమని అన్నాడు. పంత్ ఈ మ్యాచ్‌లో పునరాగమనం చేస్తాడని ఆశిస్తున్నాం అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు. 

కాగా వ‌చ్చే నెల‌లో  కీల‌క‌మైన బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ జ‌ర‌గ‌నుండంతో ముందు జాగ్ర‌త్తగా పంత్‌ను కివీస్ సిరీస్ నుంచి త‌ప్పించే అవ‌కాశ‌ముంది.  ఈ మ్యాచ్‌లో కూడా పంత్ తిరిగి మైదానంలో అడుగుపెట్టే అవ‌కాశాలు త‌క్కువ‌గా క‌న్పిస్తున్నాయి. ఒక‌వేళ పంత్ దూర‌మైతే ధ్రువ్ జురెల్ తుది జ‌ట్టులోకి రానున్నాడు. జురెల్ ఇప్ప‌టికే త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాల‌ను అందిపుచ్చుకున్నాడు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)