ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌.. టీమిండియాకు గుడ్‌ న్యూస్‌! పంత్‌ రీ ఎంట్రీ

Published on Sat, 07/22/2023 - 19:42

గతేడాది డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ వేగంగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో పంత్‌ తన పూర్తి ఫిట్‌నెస్‌ సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఎప్పటికప్పుడు జిమ్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోలను కూడా పంత్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ వస్తున్నాడు. ఇక తాజాగా బీసీసీఐ అతడి ఫిటెనెస్‌కు సంబంధించిన మెడికల్‌ బులెటిన్‌ కూడా బీసీసీఐ వెల్లడించింది.

పంత్‌ బ్యాటింగ్‌ సాధనతో పాటు వికెట్‌ కీపింగ్‌ కూడా మొదలు పెట్టినట్లు బీసీసీఐ తెలిపింది. అయితే అతడు పూర్తి స్ధాయి ఫిట్‌నెస్‌ సాధించడానికి మరో నాలుగు నుంచి ఐదు నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. అంటే భారత్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌-2023కు పంత్‌ దూరం కానున్నాడు.

అతడు తిరిగి మళ్లీ వచ్చే ఏడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగున్న టెస్టు సిరీస్‌తో మైదానంలో అడుగు పెట్టనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలో స్వదేశంలో జరగనున్న  ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది.

ప్రస్తుత టెస్టు జట్టులో పంత్‌ లేని లోటు సృష్టంగా కన్పిస్తోంది. వెస్టిండీస్‌తో జరగుతున్న టెస్టు సిరీస్‌లో పంత్‌ స్ధానంలో ఇషాన్‌ కిషన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అంతకుముందు డబ్ల్యూటీసీ ఫైనల్‌, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో శ్రీకర్‌ భరత్‌ వికెట్‌ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.
చదవండి: IND vs WI: 'అతడు మళ్లీ ఫామ్‌లోకి రావాలి.. ఎందుకంటే రోహిత్‌ తర్వాత తనే దిక్కు'

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)