Breaking News

ఢిల్లీ కెప్టెన్‌గా రిషభ్‌ పంత్‌!.. కోహ్లి ఆడుతున్నాడా?

Published on Thu, 01/16/2025 - 17:36

దేశవాళీ క్రికెట్‌లో విరాట్‌ కోహ్లి ఆడతాడా? లేదా? ఢిల్లీ తరఫున అతడు రంజీ బరిలో దిగుతాడా? అన్న ప్రశ్నలకు తెరదించేందుకు ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(డీడీసీఏ) సిద్దమైంది. రంజీ ట్రోఫీ 2024-25 సెకండ్‌ లెగ్‌లో భాగంగా జనవరి 23న మొదలుకానున్న మ్యాచ్‌కు శుక్రవారం తమ జట్టును ప్రకటించనుంది.

కోహ్లి, పంత్‌లపై విమర్శలు
కాగా రంజీ ట్రోఫీ తాజా సీజన్‌ కోసం డీడీసీఏ గతంలోనే 41 మందితో కూడి ప్రాబబుల్‌ జట్టును ప్రకటించింది. ఇందులో టీమిండియా స్టార్లు విరాట్‌ కోహ్లితో పాటు రిషభ్‌ పంత్‌, హర్షిత్‌ రాణా పేర్లు ఉన్నాయి. అయితే, జాతీయ జట్టు విధుల దృష్ట్యా కోహ్లి, పంత్‌ ఢిల్లీ తరఫున ఆడలేకపోయారు. కానీ.. ఇటీవల ఆస్ట్రేలియా(India vs Australia)తో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ సందర్భంగా కోహ్లి(Virat Kohli), పంత్‌ విఫలమైన తీరు విమర్శలకు దారి తీసింది.

ముఖ్యంగా ఈ ఇద్దరు ఢిల్లీ బ్యాటర్ల షాట్‌ సెలక్షన్‌, వికెట్‌ పారేసుకున్న విధానం చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో కోహ్లి, పంత్‌ రంజీ బరిలో దిగి.. తిరిగి మునుపటి లయను అందుకోవాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచించారు. ఈ క్రమంలో రంజీ సెకండ్‌ లెగ్‌ మ్యాచ్‌లకు రిషభ్‌ పంత్‌ అందుబాటులోకి రాగా.. కోహ్లి మాత్రం ఇంత వరకు తన నిర్ణయం చెప్పలేదు.

ఈ విషయాన్ని డీడీసీఏ కార్యదర్శి అశోక్‌ శర్మ స్వయంగా వెల్లడించాడు. పంత్‌ సెలక్షన్‌కు అందుబాటులో ఉంటానని చెప్పాడని.. అయితే, కోహ్లి మాత్రం ఈ విషయంపై మౌనం వీడటం లేదని విమర్శించాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం అతడు కచ్చితంగా రంజీల్లో ఆడాల్సిందేనని పేర్కొన్నాడు. 

కెప్టెన్‌గా రిషభ్‌ పంత్‌
అంతేకాదు.. ముంబై తరఫున టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) బరిలోకి దిగనున్నాడనే వార్తల నేపథ్యంలో.. ముంబై క్రికెటర్లును చూసి కోహ్లి నేర్చుకోవాల్సింది చాలా ఉందని హితవు పలికాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం తమ జట్టును ప్రకటించేందుకు డీడీసీఏ సిద్ధమైంది. 

ఈ విషయం గురించి డీడీసీఏ అధికారి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘శుక్రవారం మధ్యాహ్నం సెలక్షన్‌ మీటింగ్‌ జరుగుతుంది. సౌరాష్ట్రతో మ్యాచ్‌కు రిషభ్‌ పంత్‌ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది’’ అని తెలిపారు. అయితే, కోహ్లి గురించి మాత్రం తమకు సమాచారం లేదని పేర్కొన్నారు. హర్షిత్‌ రాణా మాత్రం ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ సందర్భంగా రంజీలకు అందుబాటులో ఉండడని తెలిపారు.

రంజీ ట్రోఫీ సెకండ్‌ లెగ్‌- ఢిల్లీ ప్రాబబుల్స్‌ జట్టు
విరాట్ కోహ్లి(సమాచారం లేదు), రిషబ్ పంత్, హర్షిత్ రాణా (అందుబాటులో లేడు), ఆయుష్ బదోనీ, సనత్ సంగ్వాన్, గగన్ వాట్స్, యశ్ ధూల్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), జాంటీ సిద్ధూ, సిద్ధాంత్ శర్మ, హిమ్మత్ సింగ్, నవదీప్ సైనీ, ప్రణవ్ రాజ్వంశీ (వికెట్ కీపర్), సుమిత్ మాథుర్, మనీ గ్రేవాల్, శివమ్ శర్మ, మయాంక్ గుస్సేన్, వైభవ్ కండ్పాల్, హిమాన్షు చౌహాన్, హర్ష్ త్యాగి, శివాంక్ వశిష్ట్, ప్రిన్స్ యాదవ్, ఆయుష్ సింగ్, అఖిల్ చౌదరి, హృతిక్ షోకీన్, లక్షయ్ తరేజా (వికెట్ కీపర్), ఆయుష్ దోసేజా, అర్పిత్ రాణా, వికాస్ సోలంకి, సమర్థ్ సేథ్, రౌనక్ వాఘేలా, అనిరుధ్ చౌదరి, రాహుల్ గహ్లోత్, భగవాన్ సింగ్, మయాంక్ రావత్, తేజస్వి దహియా (వికెట్ కీపర్), పార్థీక్, రాహుల్ డాగర్, ఆర్యన్ రాణా, సలీల్ మల్హోత్రా, జితేష్ సింగ్.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)