హార్దిక్‌ పాండ్యాకు బిగ్‌ షాక్‌.. టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా పంత్‌!?

Published on Mon, 04/29/2024 - 18:48

టీ20 వరల్డ్‌కప్‌-2024కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ తమ జట్టును మే 1న ప్రకటించనుంది. ఇక ఇప్పటికే  వరల్డ్‌కప్‌ కోసం తుది జట్టును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ చైర్మెన్‌ అజిత్ అగార్కర్, భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఖారారు చేసినట్లు తెలుస్తోంది. 

అయితే వరల్డ్‌కప్‌ జట్టు ఎంపిక చేసే క్రమంలో బీసీసీఐ సెలక్టర్లు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీమిండియా వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలను వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌కు అప్పగించేందుకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇప్పటివరకు రోహిత్‌ డిప్యూటీగా వ్యవహరించిన హార్దిక్‌ పాండ్యాపై సెలక్టర్లు వేటు వేసినట్లు సమాచారం. ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా విఫలమయ్యాడు. కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శన పరంగా హార్దిక్‌ నిరాశపరుస్తున్నాడు. 

ఈ క్రమంలోనే సెలక్టర్లు హార్దిక్‌ను వైస్‌ కెప్టెన్సీ నుంచి తప్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఇక 14 నెలల తర్వాత తిరిగి రీ ఎంట్రి ఇచ్చిన రిషబ్‌ పంత్‌ అదరగొడుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో పంత్ ఇప్పటివరకు 10 ఇన్నింగ్స్‌లలో 371 పరుగులు చేశాడు. కెప్టెన్సీ పరంగా కూడా పంత్‌ ఆకట్టుకుంటున్నాడు. అతడి సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ పాయింట్ల పట్టికలో ఆరో స్ధానంలో కొనసాగుతోంది.

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)