కుల్దీప్.. నీకు ఇది రెండో సారి వార్నింగ్‌? పంత్ సీరియ‌స్‌

Published on Sun, 11/23/2025 - 11:58

గువహటి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ రిషబ్ పంత్ తన సహనాన్ని కోల్పోయాడు. రెండో రోజు ఆట సందర్భంగా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై పంత్ సీరియస్ అయ్యాడు. కుల్దీప్ తన ఓవర్ ప్రారంభించడానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో పంత్ అసహనం వ్యక్తం చేశాడు.

అయితే పంత్ కోపానికి ఆర్ధం వుంది. ఎందుకంటే ఐసీసీ కొత్తగా తీసుకొచ్చిన క్లాక్ రూల్ ప్రకారం.. ఓ ఓవర్ ముగిసిన 60 సెకన్లలోపల తదుపరి ఓవర్‌ను ఆరంభించాల్సి ఉంటుంది. ఆలస్యమైతే ఫీల్డింగ్ టీంకు రెండు హెచ్చరికలు ఇస్తారు. మూడవసారి ఆలస్యమైతే బ్యాటింగ్ చేసే జట్టు ఐదు పెనాల్టీ పరుగులు కలిపిస్తారు. ఈ హెచ్చరికలు ప్రతి 80 ఓవర్లకు రీసెట్ అవుతాయి.

రెండోసారి వార్నింగ్‌..
ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో కూడా పంత్‌కు ఇదే విషయంపై  అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు రెండో రోజు ఆటలో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 88వ ఓవర్‌ను సమయానికి ప్రారంభించనందును పంత్‌కు అంపైర్ రెండోసారి వార్నింగ్ ఇచ్చాడు. అదే మూడో సారి ఇదే సమస్యపై హెచ్చరిక వస్తే భారత్ ఐదు పరుగులు పెనాల్టీగా సౌతాఫ్రికాకు ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే కుల్దీప్‌పై పంత్ ఫైరయ్యాడు. "30 సెకన్ల టైమర్ ఉంది. ఇంట్లో ఆడుతున్నాను అనుకున్నావా ఏంటి? త్వరగా ఒక బంతి వేయి. కుల్దీప్ ఇది నీకు రెండోసారి హెచ్చరిక"అని పంత్‌ గట్టిగా చెప్పాడు. ఇదంతా స్టంప్‌ మైక్‌లో రికార్డు అయింది. 

కాగా సౌతాఫ్రికా వికెట్లను పడగొట్టేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 112 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. క్రీజులో ముత్తుసామి(64), వెర్రియిన్‌(43) ఉన్నారు.


 

 

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)