Breaking News

బ్యాట్‌ పట్టిన రిషబ్‌ పంత్‌.. సిక్సర్ల వర్షం​!‍ వీడియో వైరల్‌

Published on Thu, 08/17/2023 - 08:26

టీమిండియా అభిమానులకు గుడ్‌న్యూస్‌. గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడి జట్టుకు దూరంగా ఉంటున్న స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ తిరిగి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో ఉన్న పంత్‌.. శర వేగంగా కోలుకుంటున్నాడు. పంత్‌ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ కూడా మెదలుపెట్టేశాడు.

మైదానంలో అడుగుపెట్టిన రిషబ్‌..
ఇక ఇది ఇలా ఉండగా.. గాయపడిన 8 నెలల తర్వాత పంత్‌ తొలిసారి మైదానంలో అడుగుపెట్టాడు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జేఎస్​డబ్ల్యూ ఫాండేషన్‌ నిర్వహించిన ఓ స్ధానిక టోర్నీలో బరిలోకి దిగిన పంత్.. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు.

ఫ్రంట్ ఫుట్‌లో ఎక్స్‌ట్రా కవర్ మీదుగా పంత్ కొట్టిన సిక్స్‌ అభిమానులను అలరించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక స్వదేశంలో వచ్చే ఏడాది ఇం‍గ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌తో పంత్‌ పునరాగమనం చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 సైకిల్‌లో భాగంగా ఇంగ్లండ్‌ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడేందుకు భారత్‌కు రానుంది.
చదవండి: #Shreyas Iyer: మంచి మనసు చాటుకున్న శ్రేయస్‌ అయ్యర్‌.. వీడియో వైరల్‌

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)