Breaking News

రిషబ్ పం‍త్‌కు భారీ షాకిచ్చిన బీసీసీఐ

Published on Wed, 05/28/2025 - 11:05

ఐపీఎల్‌-2025 సీజన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఓటమితో ముగించింది. సోమవారం ఏకానా స్టేడియం వేదికగా రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ ప‌రాజ‌యం పాలైంది. అయితే ఓట‌మి బాధలో ఉన్న ల‌క్నో కెప్టెన్ రిష‌బ్ పంత్‌కు మ‌రో బిగ్‌ షాక్ త‌గిలింది.

ఆర్సీబీతో జ‌రిగిన మ్యాచ్‌లో స్లో ఓవ‌ర్ రేటు మెయింటిన్ చేసినందుకుగానూ పంత్‌కు రూ. 30 లక్షల భారీ జరిమానా ఐపీఎల్ ఎడ్వైజ‌రీ క‌మిటీ విధించింది. అలాగే జ‌ట్టులో ఇంపాక్ట్ ప్లేయ‌ర్ స‌హా అంద‌రూ రూ. 12 ల‌క్ష‌లు లేదా మ్యాచ్ ఫీజులో 50శాతం జ‌రిమానాగా చెల్లించాల‌ని స‌ద‌రు క‌మిటీ ఆదేశించింది.

ఈ ఏడాది సీజ‌న్‌లో ల‌క్నో జ‌ట్టు స్లో ఓవ‌ర్ రేట్‌ను న‌మోదు చేయ‌డం ఇది మూడో సారి. అందుకే అంత భారీ మొత్తంలో జ‌రిమానా విధించారు. "ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ సార‌థి రిష‌బ్ పంత్‌కు జరిమానా విధించాం. ఏకానా స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించినందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నాము. ఇది మూడో సారి అయినందున ఆర్టికల్ 2.22 ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్ ప్రకారం పంత్‌ కు రూ. 30 లక్షలు ఫైన్ వేశాము ’ అని ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. 

కాగా ఈ మ్యాచ్‌లో రిషబ్‌ పంత్ అద్బుతమైన సెంచ‌రీతో చెల‌రేగాడు. సీజ‌న్ ఆరంభం నుంచి విఫ‌ల‌మైన పంత్‌.. త‌మ ఆఖ‌రి మ్యాచ్‌లో మాత్రం విధ్వంసం సృష్టించాడు. రిషబ్‌ 61 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 118 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67, 4 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో మెరిశాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది.  అనంతరం  228 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని బెంగ‌ళూరు కేవ‌లం నాలుగు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 18.4 ఓవర్లలో చేధించింది.
చదవండి: IND Vs ENG: బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం.. దిలీప్‌కు మ‌ళ్లీ పిలుపు

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)