Breaking News

ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్‌ న్యూస్‌.. రిషబ్‌ పంత్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

Published on Tue, 03/12/2024 - 13:38

ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభవార్త అందింది. ఆ జట్టు కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌కు ఐపీఎల్‌ ఆడేందుకు బీసీసీఐ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 2022 చరమాంకంలో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్‌ 14 నెలల రీహ్యాబ్‌ అనంతరం పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడని బీసీసీఐ సర్టిఫై చేసింది. పంత్‌ బ్యాటర్‌గానే కాకుండా వికెట్‌కీపర్‌గానూ ఫిట్‌గా ఉన్నాడని బీసీసీఐ ధృవీకరించింది. ఈ మేరకు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది.

బీసీసీఐ ఇచ్చిన సర్టిఫికెట్‌తో పంత్‌కు రానున్న ఐపీఎల్‌ సీజన్‌ ఆడేందుకు మార్గం సుగమం అయ్యింది. పంత్‌ బ్యాటర్‌గానే కాకుండా వికెట్‌కీపింగ్‌ కూడా చేయగలడిన బీసీసీఐ సర్టిఫికెట్‌ ఇవ్వడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ అభిమానుల ఆనందానికి అవథుల్లేకుండా పోతున్నాయి. పంత్‌ ఐపీఎల్‌ 2024లో ఆడతాడని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నా, వికెట్‌కీపింగ్‌ చేస్తాడా లేదా అన్న విషయమై సందిగ్దత నెలకొని​ ఉండింది. బీసీసీఐ తాజా ప్రకటనతో అభిమానుల అనుమానాలన్నీ తొలగిపోయాయి. రీఎంట్రీలో పంత్‌ మునపటిలా చెలరేగుతాడో లేదో వేచి చూడాలి.

పంత్‌ గురించి అప్‌డేట్‌ ఇచ్చే సందర్భంగానే బీసీసీఐ మరో ఇద్దరు ఆటగాళ్ల గురించి కూడా ప్రకటన విడుదల చేసింది. ఇటీవలే సర్జరీ చేయించుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌​ బౌలర్‌ ప్రసిద్ద్‌ కృష్ణ ఐపీఎల్‌ 2024 సీజన్‌ మొత్తానికి దూరంగా ఉండనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అలాగే చీలిమండ సర్జరీ చేయించుకున్న గుజరాత్‌ టైటాన్స్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీ కూడా సీజన్‌ మొత్తానికి అందుబాటులో ఉండడని అధికారికంగా కన్ఫర్మ్‌ చేసింది. కాగా, ఐపీఎల్‌ 2024 సీజన్‌ మార్చి 22 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే.

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)