Breaking News

రిషబ్‌ పంత్‌ సరికొత్త చరిత్ర.. 148 ఏళ్ల టెస్టు క్రికెట్‌ హిస్టరీలోనే

Published on Tue, 06/24/2025 - 13:14

లీడ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌ రెండు ఇన్నింగ్స్‌లలోనూ పంత్‌ సెంచరీలతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు చేసిన పంత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేశాడు.

తన అద్బుత సెంచరీలతో ఇంగ్లండ్‌కు 371 పరుగుల లక్ష్యాన్ని ఉంచడంలో పంత్‌ కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో పంత్‌ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

పంత్‌ సాధించిన రికార్డులు ఇవే..
ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన వికెట్‌ కీపర్‌గా పంత్‌ చరిత్ర సృష్టించాడు. లీడ్స్‌ టెస్టులో పంత్‌ 252 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ బుద్ధి కుందరన్‌ పేరిట ఉండేది. కుందరన్‌ 1964లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో రెండు సెంచరీలు సాధించాడు. తాజా మ్యాచ్‌తో 61 ఏళ్ల కుందరన్‌ ఆల్‌టైమ్‌ రికార్డును పంత్‌ బ్రేక్‌ చేశాడు.

ఒకే టెస్టు మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్‌ కీపర్లు వీరే..
👉రిషబ్ పంత్ 252
👉బుద్ధి కుందరన్ 230
👉ఎంఎస్ ధోని 224
👉రిషబ్ పంత్ 203
👉ఫరోఖ్ ఇంజనీర్ 187

👉అదేవిధంగా 148 టెస్టు క్రికెట్‌ హిస్టరీలోనే ఒకే మ్యాచ్‌లో 2 సెంచరీలు బాదిన రెండో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ నిలిచాడు. ఈ అరుదైన ఫీట్‌ సాధించిన జాబితాలో జింబాబ్వే దిగ్గజం ఆండీ ఫ్లవర్ అగ్రస్ధానంలో ఉన్నారు. సౌతాఫ్రికాతో 2001లో జరిగిన టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 142 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 199 పరుగులతో ఫ్లవర్‌ ఆజేయంగా నిలిచాడు.

👉ఒక టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలు చేసిన ఏకైక ఆసియాన్‌ వికెట్‌ కీపర్‌ కూడా పంత్‌ కావడం విశేషం.

👉ఇంగ్లండ్‌ గడ్డపై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో భారత ఆటగాడిగా క్రికెట్‌ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్,దిలీప్ వెంగ్‌సర్కార్ రికార్డును రిషబ్‌ సమం చేశాడు. వారిద్దరూ ఇంగ్లండ్‌లో నాలుగు టెస్టు సెంచరీలు సాధించారు. పంత్‌కు కూడా ఇంగ్లండ్‌ గడ్డపై నాలుగో టెస్టు సెంచరీ. ఈ రేర్‌ ఫీట్‌సాధించిన జాబితాలో రాహుల్ ద్రవిడ్ 6 సెంచరీలతో రాహుల్‌ ద్రవిడ్‌ అగ్రస్ధానంలో ఉన్నాడు.


 

 

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు