వారెవ్వా పంత్‌.. దెబ్బ‌కు ధోని రికార్డు బ‌ద్ద‌లు

Published on Sat, 10/19/2024 - 13:49

బెంగ‌ళూరు వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో భార‌త స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌బ్ పంత్ ఫైటింగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఓ వైపు గాయం బాధ‌ప‌డుతూనే సెకెండ్ ఇన్నింగ్స్‌లో త‌న  12వ టెస్ట్ హాఫ్ సెంచరీని సాధించాడు. 

గాయం కార‌ణంగా మూడో రోజు ఆట‌కు దూర‌మైన పంత్‌.. కీల‌కమైన నాలుగో రోజు ఆట‌లో తిరిగి మైదానంలో మ‌ళ్లీ అడుగుపెట్టాడు. ఈ క్ర‌మంలో స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌తో క‌లిసి భార‌త స్కోర్ బోర్డును పంత్ ప‌రుగులు పెట్టిస్తున్నాడు. తొలుత కాస్త ఆచితూచి ఆడిన రిష‌బ్‌.. నెమ్మ‌దిగా త‌న బ్యాటింగ్‌లో స్పీడ్‌ను పెంచాడు. 54 ప‌రుగుల‌తో పంత్ ఆజేయంగా నిలిచాడు. అత‌డి ఇన్నింగ్స్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 5 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి.

ధోని రికార్డు బ‌ద్ద‌లు
ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచ‌రీతో మెరిసిన పంత్ ఓ అరుదైన ఘ‌న‌త‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా  2,500 పరుగుల మైలు రాయిని అందుకున్న భారత వికెట్ కీప‌ర్‌గా పంత్ రికార్డుల‌కెక్కాడు. 

ఇంతకు ముందు ఈ రికార్డు భార‌త క్రికెట్ దిగ్గ‌జం, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరిట ఉండేది. ధోని ఈ మైలు రాయిని 69 ఇన్నింగ్స్‌లలో అందుకోగా.. రిష‌బ్ కేవ‌లం 62 ఇన్నింగ్స్‌ల‌లోనే సాధించాడు. 
చదవండి: IND vs NZ: చ‌రిత్ర సృష్టించిన టీమిండియా.. 147 ఏళ్లలో తొలిసారి!
 

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)