Breaking News

రిషబ్‌ పంత్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ..

Published on Tue, 06/24/2025 - 13:57

టీమిండియా స్టార్‌ వికెట్‌ ​కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌కు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) ఊహించని షాకిచ్చింది. లీడ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అంపైర్‌తో వాగ్వదం దిగినందుకు గానూ పంత్‌కు ఓ డిమెరిట్‌ పాయింట్‌ ఐసీసీ విధించింది.

ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8ని ఉల్లంఘించినందుకు ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. గత 24 నెలలలో ఇదే తొలి తప్పిదం అయినందున కేవలం ఒక డీమెరిట్‌ పాయింట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ సరిపెట్టింది.

అసలేమి జరిగిందంటే?
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 61 ఓవర్‌లో బంతిని మార్చమని ఫీల్డ్‌ అంపైర్‌ పాల్ రీఫెల్‌పై పంత్‌ ఒత్తిడి తీసుకొచ్చాడు. బంతి కండీషన్‌ బాగోలేదని కొత్త బంతిని తీసుకురావాలని పంత్‌ సూచించాడు. కానీ ఫీల్డ్‌ అంపైర్‌లు బంతిని పరిశీలించి, మార్చాల్సిన అవసరంలేదంటూ అదే బాల్‌ను తిరిగి పంత్‌కు ఇచ్చాడు.

ఈ క్రమంలో సహనం కోల్పోయిన పంత్‌.. బంతిని నేలకేసి బలంగా కొట్టాడు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్‌కు ఫిర్యాదు చేశారు. పంత్‌ కూడా తన తప్పును అంగీకరించాడు. ఈ నేపథ్యంలోనే పంత్‌పై ఐసీసీ మ్యాచ్‌ రిఫరీ ఈ చర్యలు తీసుకున్నారు.

శతక్కొట్టిన పంత్‌..
కాగా ఈ మ్యాచ్‌లో పంత్‌ సెంచరీలు మోత మోగించాడు. రెండో ఇన్నింగ్స్‌లలోనూ శతకాలు బాది సంచలనం సృష్టించాడు. ఓ టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన తొలి భారత వికెట్‌ కీపర్‌గా రికార్డులకెక్కాడు.  తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు చేసిన పంత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేశాడు. కాగా తొలి టెస్టులో విజయంపై భారత్‌ కన్నేసింది.

ఇంగ్లండ్‌ ముందు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని గిల్‌ సేన ఉంచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఆఖరి రోజు ఆటలో ఎవరు మెరుగ్గా రాణిస్తే వారిదే విజయం.
చదవండి: రింకూ సింగ్‌- ఎంపీ ప్రియా సరోజ్‌ పెళ్లి వాయిదా!.. కారణం ఇదే!
 

Videos

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

వామ్మో అన్ని కోట్లా? నాగార్జున రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

మెగా DSCలో అక్రమాలను కప్పిపుచ్చలేక అధికారుల తంటాలు

ఆక్వా రైతులకు మరోసారి బిగ్ షాక్

ఈ లాజిక్ ఎలా మిస్సయ్యావ్ లోకేష్ ఇక నీ చాప్టర్ క్లోజ్..

అన్నాచెల్లెళ్ల టీచర్ జాబ్.. బయటపడ్డ నకిలీ సర్టిఫికెట్ల బాగోతం

DSC అక్రమాల పుట్ట గుట్టురట్ట

అతి దారుణంగా కారణం ఇదేన బస్సు స్టాండ్ లో..! పోలీస్ మార్క్ ట్రీట్ మెంట్

Photos

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)