Breaking News

శ్రేయస్‌ అయ్యర్ దూరం..! కేకేఆర్ కొత్త కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్!

Published on Thu, 03/16/2023 - 13:22

ఐపీఎల్-2023 ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌, టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉంది. గత కొంతకాలంగా వెన్నునొప్పి సమస్యతో బాధపడుతూ, శస్త్ర చికిత్స సైతం చేయించుకున్న అయ్యర్‌.. అహ్మదాబాద్‌ టెస్ట్‌ సందర్భంగా అతడి గాయం తిరగబెట్టింది.

దీంతో అతడు స్వదేశంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. అతడు వెన్ను గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు నాలుగు నుంచి ఐదు వారాల సమయం పట్టనున్నట్లు భారత క్రికెట్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే అయ్యర్‌ ఐపీఎల్‌ సీజన్‌ మొత్తానికి దూరం కానున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో కేకేఆర్ కు కొత్త సారథి ఎవరన్న చర్చ నడుస్తోంది. ఈ ఏడాది సీజన్‌లో కేకేఆర్‌ కెప్టెన్‌గా ఆల్‌రౌండర్‌ రింకూ సింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా కేకేఆర్‌ షేర్‌ చేసిన ఓ వీడియో ఈ వార్తలకు మరింత ఊతమిస్తుంది. రింకూ సింగ్ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో కేకేఆర్‌ షేర్‌ చేసింది.

 ఈ వీడియోకు కేకేఆర్ అభిమాని ఒకరు.. ‘గేమ్ ఛేంజర్ రింకూ..’అని రాసుకొచ్చాడు. దానికి కేకేఆర్ రిప్లై ఇస్తూ.. ‘మా ​కెప్టెన్‌ అని రాసుకొచ్చింది. కానీ.. వెంటనే ఆ కామెంట్‌ని డిలీట్ చేసింది. ఇక​ ఇప్పటి వరకు 17 ఐపీఎల్ మ్యాచ్‌లాడిన రింకూ కేవలం 251 పరుగులు మాత్రమే చేశాడు. అయితే రింకూ సింగ్‌కు మాత్రం పవర్‌ హిట్టర్‌ అనే పేరు ఉంది. కాగా ప్రస్తుత కేకేఆర్‌ జట్టులో టిమ్‌ సౌథీ. సునీల్‌ నరైన్‌, రస్సెల్‌ వంటి సీనియర్‌ ఆటగాళ్లు కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నారు. అయితే వీరిలో అదృష్టం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.

చదవండి: WTC Final:డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కేఎల్‌ రాహుల్‌ వద్దు.. భరత్‌ సరైనోడు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)