Breaking News

టెస్ట్‌ల్లోకి రింకూ..?

Published on Tue, 07/16/2024 - 17:05

పొట్టి ఫార్మాట్‌లో అత్యుత్తమ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న భారత అప్‌ కమింగ్‌ స్టార్‌ రింకూ సింగ్‌పై టీమిండియా తాజా మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రింకూకు టెస్ట్‌ల్లో అవకాశాలు కల్పిస్తే ఖచ్చితంగా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. రింకూకు ఉన్న టెంపర్‌మెంట్‌ సుదీర్ఘ ఫార్మాట్‌కు సరిగ్గా సరిపోతుందని అభిప్రాయపడ్డాడు. 

రింకూ నెట్స్‌లో బ్యాటింగ్‌ చేసే విధానం చూస్తే, అతనెందుకు టెస్ట్‌ జట్టులో ఉండకూడదని అనిపిస్తుందన్నాడు. రింకూ ఫస్ట్‌ క్లాస్‌ ‍క్రికెట్‌లో 50కి పైగా సగటు కలిగి ఉన్నాడన్న విషయాన్ని గుర్తు చేశాడు. సరిగ్గా వినియోగించుకుంటే రింకూ టెస్ట్‌ల్లో సత్తా చాటగలడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాథోడ్‌ రింకూపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. 

26 ఏళ్ల రింకూ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తాడు. ఈ ఫార్మాట్‌లో అతను 47 మ్యాచ్‌లు ఆడి 54.70 సగటున 3173 పరుగులు చేశాడు. త్వరలో భారత్‌.. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్ట్‌ సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌ కోసం భారత సెలెక్టర్లు రింకూ సింగ్‌ పేరును పరిశీలిస్తారేమో చూద్దాం.

ఇదిలా ఉంటే, రింకూ.. భారత్‌ టీ20 వరల్డ్‌ కప్‌ 2024 గెలిచిన జట్టులో రిజర్వ్‌ సభ్యుడిగా ఉన్నాడు. జట్టు కూర్పులో సమతుల్యత కోసం ప్రపంచకప్‌ జట్టుకు రింకూని ఎంపిక చేయలేదు. తాజాగా జింబాబ్వే ముగిసిన టీ20 సిరీస్‌లో రింకూ చెప్పుకోదగ్గ స్కోర్లేమీ చేయలేదు. ఈ సిరీస్‌లో అతను నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 60 పరుగులు మాత్రమే చేశాడు. ఓవరాల్‌గా రింకూ టీ20 కెరీర్‌లో 15 ఇన్నింగ్స్‌లు ఆడి 83.2 సగటున, 176.27 స్ట్రయిక్‌రేట్‌తో 416 పరుగులు చేశాడు. రింకూ గతేడాది వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. ఈ ఫార్మాట్‌లో అతను రెండు మ్యాచ్‌లు ఆడి 55 పరుగులు చేశాడు. 

Videos

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

Photos

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు