Breaking News

రింకూ సింగ్‌ను మించినోడే లేడు.. ఈ గణంకాలు చూడండి..!

Published on Tue, 01/16/2024 - 12:11

పొట్టి క్రికెట్‌లో టీమిండియా విధ్వంసకర బ్యాటర్‌ రింకూ సింగ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఆడింది తక్కువ మ్యాచ్‌లే అయినా ఎవరికీ సాధ్యంకాని రికార్డులతో దూసుకుపోతున్నాడు. తాజాగా రింకూ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. ఐసీసీ పుల్‌ మెంబర్‌ జట్లలో 10 టీ20 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక స్ట్రయిక్‌రేట్‌, సగటు కలిగిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 

రింకూ తన 10 ఇన్నింగ్స్‌ల్లో 176.07 స్ట్రయిక్‌రేట్‌తో 71.75 సగటున ఓ హాఫ్‌ సెంచరీ సాయంతో 287 పరుగులు చేశాడు. రింకూ 10 ఇన్నింగ్స్‌ల్లో ఆరింట నాటౌట్‌గా నిలిచాడు. రింకూ ఖాతాలో 29 ఫోర్లు, 14 సిక్సర్లు ఉన్నాయి. ఈ గణాంకాలు చూసి పొట్టి క్రికెట్‌లో రింకూను మించినోడే లేడని భారత క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. 10 టీ20 ఇన్నింగ్స్‌ల అనంతరం అత్యధిక సగటు, స్ట్రయిక్‌రేట్‌ కలిగిన ఆటగాళ్ల జాబితా ఇలా ఉంది.

  • రింకూ సింగ్‌-176.07 స్ట్రయిక్‌రేట్‌తో 71.75 సగటు
  • మిస్బా ఉల్‌ హాక్‌- 135 స్ట్రయిక్‌రేట్‌తో 67.60 సగటు
  • డెవాన్‌ కాన్వే- 151 స్ట్రయిక్‌రేట్‌తో 65.43 సగటు
  • కేఎల్‌ రాహుల్‌- 151 స్ట్రయిక్‌రేట్‌తో 56.75 సగటు
  • ఆండ్రూ సైమండ్స్‌- 170 స్ట్రయిక్‌రేట్‌తో 56.17 సగటు
  • బాబర్‌ ఆజమ్‌- 123 స్ట్రయిక్‌రేట్‌తో 54.86 సగటు

అంతర్జాతీయ టీ20ల్లో రింకూ సింగ్‌ స్కోర్లు..

  1. ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో టీ20 9 నాటౌట్‌
  2. ఆఫ్ఘనిస్తాన్‌తో తొలి టీ20 16 నాటౌట్‌
  3. సౌతాఫ్రికాతో మూడో టీ20 14
  4. సౌతాఫ్రికాతో రెండో టీ20 68 నాటౌట్‌
  5. ఆస్ట్రేలియాతో ఐదో టీ20 6
  6. ఆస్ట్రేలియాతో నాలుగో టీ20 46
  7. ఆస్ట్రేలియాతో రెండో టీ20 31 నాటౌట్‌
  8. ఆస్ట్రేలియాతో తొలి టీ20 22 నాటౌట్‌
  9. నేపాల్‌తో టీ20 (ఆసియా క్రీడలు) 37 నాటౌట్‌
  10. ఐర్లాండ్‌తో రెండో టీ20 38

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)