Breaking News

రికీ భుయ్‌ మెరుపులు

Published on Sun, 09/22/2024 - 09:44

సాక్షి, అనంతపురం: ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్‌ (87 బంతుల్లో 90 బ్యాటింగ్‌; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా భారత్‌ ‘బి’తో జరుగుతున్న దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌లో భారత్‌ ‘డి’ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 44 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. 

కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ (40 బంతుల్లో 50; 7 ఫోర్లు, ఒక సిక్సర్‌), సంజూ సామ్సన్‌ (53 బంతుల్లో 45; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఓపెనర్లు దేవదత్‌ పడిక్కల్‌ (3), శ్రీకర్‌ భరత్‌ (2) విఫలమయ్యారు. 18 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో భుయ్, శ్రేయస్‌ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. వీరిద్దరూ ఎడాపెడా బౌండ్రీలు బాదుతూ వన్డే తరహాలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. భారత్‌ ‘బి’ బౌలర్లలో ముకేశ్‌ కుమార్‌ 3, నవ్‌దీప్‌ సైనీ రెండు వికెట్లు పడగొట్టారు. 

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 210/6తో శనివారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ ‘బి’ చివరకు 76.2 ఓవర్లలో 282 పరుగులకు ఆలౌటైంది. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ (140 బంతుల్లో 87; 7 ఫోర్లు, ఒక సిక్సర్‌) ఆకట్టుకున్నాడు. చివరి వరస ఆటగాళ్లతో కలిసి జట్టుకు విలువైన స్కోరు అందించాడు. భారత్‌ ‘డి’ బౌలర్లలో సౌరభ్‌ కుమార్‌ 5, అర్‌‡్షదీప్‌ సింగ్‌ మూడు వికెట్లు పడగొట్టారు. నేడు ఆటకు చివరి రోజు కాగా... చేతిలో 5 వికెట్లు ఉన్న భారత్‌ ‘డి’ ఓవరాల్‌గా 311 పరుగుల ఆధిక్యంలో ఉంది. రికీ భుయ్‌తో పాటు ఆకాశ్‌ సేన్‌ గుప్తా (28 బ్యాటింగ్‌; 4 ఫోర్లు) క్రీజులో ఉన్నారు.  

స్కోరు వివరాలు 
భారత్‌ ‘డి’ తొలి ఇన్నింగ్స్‌: 349; 
భారత్‌ ‘బి’ తొలి ఇన్నింగ్స్‌: 282 
భారత్‌ ‘డి’ రెండో ఇన్నింగ్స్‌: దేవదత్‌ పడిక్కల్‌ (సి) జగదీశన్‌ (బి) నవ్‌దీప్‌ సైనీ 3; శ్రీకర్‌ భరత్‌ (బి) ముకేశ్‌ కుమార్‌ 2; రికీ భుయ్‌ (నాటౌట్‌) 90; నిశాంత్‌ సింధు (సి అండ్‌ బి) నవ్‌దీప్‌ సైనీ 5; శ్రేయస్‌ అయ్యర్‌ (సి) మోహిత్‌ అవస్థి (బి) ముకేశ్‌ కుమార్‌ 50; సంజూ సామ్సన్‌ (సి) ప్రభుదేశాయ్‌ (బి) ముకేశ్‌ కుమార్‌ 45; ఆకాశ్‌ సేన్‌ గుప్తా (నాటౌట్‌) 28; ఎక్స్‌ట్రాలు: 21; మొత్తం (44 ఓవర్లలో 5 వికెట్లకు) 244. వికెట్ల పతనం: 1–9, 2–13, 3–18, 4–93, 5–161, బౌలింగ్‌: ముకేశ్‌ కుమార్‌ 13–0–80–3; నవ్‌దీప్‌ సైనీ 11–2–40–2; మోహిత్‌ అవస్థి 9–2–41–0; నితీశ్‌ కుమార్‌ రెడ్డి 3–0–19–0; రాహుల్‌ చాహర్‌ 5–0–27–0; ముషీర్‌ ఖాన్‌ 3–0–18–0.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)