రిటైర్మెంట్ తర్వాత రహానేకి బీసీసీఐ పెన్షన్.. నెలకి ఎంతంటే?

Published on Sun, 08/02/2026 - 12:23

టీమిండియా సీనియ‌ర్ బ్యాట‌ర్ అజింక్య ర‌హానే ఇటీవ‌ల‌ త‌న 15 ఏళ్ల అంత‌ర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు ప‌లికిన సంగ‌తి తెలిసిందే. 34 ఏళ్ల ర‌హానే ప్లేయ‌ర్‌గా, కెప్టెన్‌గా భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో త‌న‌కంటూ కొన్ని ప్ర‌త్యేక పేజీల‌ను లిఖించుకున్నాడు.

అత‌డి సార‌థ్యంలోనే భారత్‌ 2021లో ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై చారిత్రాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. అయితే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రహానేకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నుంచి ఎంత పెన్షన్ వస్తుందో తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.

రహానే పెన్షన్ ఎంతంటే?
బీసీసీఐ మాజీ క్రికెట‌ర్ల‌ను వారి అనుభవం, ఆడిన టెస్ట్ మ్యాచ్‌ల ఆధారంగా మూడు విభాగాలగా విభజించింది. అత్యధికంగా 25 కంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లు టాప్ కేటగిరీకి వస్తారు. వారికి ప్రస్తుతం నెలకు రూ.70,000 చొప్పున పెన్షన్ లభిస్తుంది. 

గతంలో ఈ జాబితాలో ఉన్న ఆటగాళ్లకు నెలకు రూ. 50,000 దక్కేది. కానీ 2022లో సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ మొత్తాన్ని రూ.70,000కు పెంచాడు. ఇప్పుడు భారత్ తరఫున 85 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రహానే, అత్యున్నత పెన్షన్ స్లాట్‌లో ఉన్నాడు. 

అతడికి ప్రతీ నెల రూ.70,000 పెన్షన్ లభించనుంది. ఇక దిగువ శ్రేణిలోని వారికి రూ. 60 వేలు, ఫ‌స్ట్‌క్లాస్ మాజీ ఆట‌గాళ్ల‌కు రూ. 30 వేలు పెన్ష‌న్ అందిస్తోంది. పెన్షన్ పథకం ప్రస్తుతం దాదాపు 900 మందికి పైగా రిటైర్డ్ క్రికెటర్లు, అంపైర్లకు ప్రయోజనం చేకూరుస్తోంది.

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)