Breaking News

జెర్సీ నంబ‌ర్ 18, 45ల‌కు రిటైర్ మెంట్ ఇవ్వాలి.. స‌చిన్‌, ధోని లానే: రైనా

Published on Fri, 07/05/2024 - 19:22

టీమిండియా స్టార్ క్రికెట‌ర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌లు త‌మ‌ అంత‌ర్జాతీయ టీ20 కెరీర్‌కు ఘ‌నంగా విడ్కోలు ప‌లికారు. గ‌త 13 ఏళ్ల‌గా ఊరిస్తున్న వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను భార‌త్‌కు అందించి వారు త‌మ టీ20 ప్ర‌య‌ణాన్ని  ముగించారు. 

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్-2024 విజ‌యం త‌ర్వాత ఈ దిగ్గ‌జ క్రికెట‌ర్లు పొట్టి క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించారు. అనంత‌రం ట్రోఫీతో భార‌త గడ్డ‌పై అడుగుపెట్టిన ఈ లెజెండ‌రీ క్రికెట‌ర్లకు అభిమానుల నుంచి ఘ‌న స్వాగతం ల‌భించింది. 

ఈ నేప‌థ్యంలో భారత మాజీ క్రికెట‌ర్ సురేష్ రైనా బీసీసీఐకి ఓ విజ్ఞప్తి చేసాడు.  భార‌త దిగ్గ‌జ క్రికెట‌ర్లు స‌చిన్ టెండూల్క‌ర్‌, ఎంస్ ధోని మాదిరిగానే విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌ల జెర్సీల‌ను సైతం రిటైర్ చేయాలని రైనా బీసీసీఐని కోరాడు. కాగా విరాట్ కోహ్లి జెర్సీ నెం. 18 కాగా.. రోహిత్ జెర్సీ నంబ‌ర్ 45.

"బీసీసీఐకి ఓ విజ్ఞప్తి చేయాల‌న‌కుంటున్నాను. వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను అందించిన విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌ల‌కు ప్ర‌త్యేక గౌర‌వం ద‌క్కాలి. కాబ‌ట్టి జెర్సీ నెం.18 నెం. 45ని రిటైర్ చేయమ‌ని భార‌త క్రికెట్ బోర్డును అభ్యర్థిస్తున్నాను. 

ఈ రెండు జెర్సీల‌ను బీసీసీఐ  తమ కార్యాలయంలో గౌర‌వంగా ఉంచుకోవాలి.  ఇప్ప‌టికే జెర్సీ నెం 10(స‌చిన్‌), నెం 7(ధోని)ల‌కు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ రిటైర్మెంట్ ఇచ్చింది. ఆవిధంగానే ఇప్పుడు విరాట్‌, రోహిత్ జెర్సీ నెంల‌ను ఎవ‌రికీ కేటాయించకూడదు. 

ఆ జెర్సీ నంబ‌ర్‌లను చూస్తే ప్ర‌తీ ఒక్క‌రికి స్పూర్తి క‌ల‌గాలి. నెం.18,  నెం. 45ల జెర్సీ ధ‌రించిన ఆ ఇద్ద‌రు ఆట‌గాళ్లు భార‌త్‌కు ఎన్నో చారిత్ర‌త్మ‌క విజ‌యాల‌ను అందించారు.  ఏ ఆటగాడు జట్టులోకి వచ్చినా ఈ జెర్సీ నంబర్ల‌ను ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని" జియో సినిమాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో రైనా పేర్కొన్నాడు.
 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు