క్రికెటర్లు తిల‌క్ వ‌ర్మ‌, సిరాజ్‌ల‌కు లీగ‌ల్‌ నోటీసులు!

Published on Fri, 06/19/2026 - 07:41

భార‌త స్టార్ క్రికెట‌ర్లు తిల‌క్ వ‌ర్మ‌, మ‌హ్మ‌ద్ సిరాజ్‌ల‌కు తెలంగాణ క్రికెట్ అసోసియేష‌న్ (టీసీఏ) లీగల్ నోటీసులు జారీ చేసింది.  బీసీసీఐ నుంచి అనుమ‌తి లేకుండానే హెచ్‌సీఏ నిర్వ‌హిస్తున్న టీజీ 20 లీగ్‌కు ప్ర‌చారం చేయ‌డాన్ని త‌ప్పుబ‌డుతూ నోటీసులు జారీ చేసిన‌ట్లు టీసీఏ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ గుర‌వారెడ్డి తెలిపారు. 

కాగా వీరిద్దరితో పాటు టీజీ 20 లీగ్ ఆపరేషన్స్ హెడ్‌, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సహా ప్రచార కర్తలుగా ఉ‍న్న సినీ హీరోలు విజయ్ దేవరకొండ, వెంకటేశ్ దగ్గుబాటిలకు కూడా నోటీసులు జారీ చేసినట్లు టీసీఏ తెలిపింది. భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి అనుమ‌తి లేని టీజీ20కి ప్ర‌చారం చేయ‌డం అక్ర‌మ‌మ‌ని పేర్కొన్న టీసీఏ చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది.

టీసీఏ ఆరోపణల ప్రకారం బీసీసీఐ అనుమతి లేకుండానే హెచ్‌సీఏ టీజీ 20 లీగ్‌ను నిర్వహిస్తున్నట్లు తమకు సమాచారం అందింది. అందుకే టీజీ20 లీగ్‌కు ఆడనున్న క్రికెట‍ర్లతో పాటు ప్రచారకర్తలుగా హీరోలకు, లీగ్ ఆపరేషన్స్ హెడ్ అంబటి రాయుడుకు కూడా లీగల్ నోటీసులు అందించినట్లు టీసీఏ పేర్కొంది.

హెచ్‌సీఏ ఆధ్వర్యంలో టీ20 తరహాలో టీజీ20 క్రికెట్ లీగకు శ్రీకారం చుట్టారు. ఈ టోర్నీలో 8 క్రికెట్ జట్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, మెదక్, నల్గొండ, కరీంనగర్, మహబూబ్నగర్, ఖమ్మం జట్లున్నాయి. జూన్ 20 నుంచి ప్రారంభం కానున్న టోర్నీ జులై 11న ఫైనల్‌తో ముగియ‌నుంది.

Read: కెనడా ప్లేయర్‌కు విరిగిన కాలు; కట్‌చేస్తే ఖతార్‌కు చుక్కలు!

Videos

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)