Breaking News

గుడ్‌న్యూస్‌.. ఆగస్టు 10 నుంచి వరల్డ్‌కప్‌ టికెట్లు అందుబాటులో!

Published on Sat, 07/29/2023 - 17:10

అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 19 వరకు టీమిండియా గడ్డపై వన్డే వరల్డ్‌కప్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మ్యాచ్‌లు జరిగే వేదికలు, మ్యాచ్‌ షెడ్యూల్‌ వివరాలను బీసీసీఐ ప్రకటించింది. తాజాగా వన్డే ప్రపంచకప్‌కు సంబంధించిన మ్యాచ్‌ల టికెట్లను ఆగస్టు 10 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు సమాచారం.

బీసీసీఐ కార్యదర్శి జై షా గురువారం ఢిల్లీలో.. మ్యాచ్‌లు జరగనున్న అన్ని రాష్ట్రాల క్రికెట్‌ అసోసియేషన్లతో గురువారం మీటింగ్‌ నిర్వహించారు. మీటింగ్‌లో పలు అంశాలపై చర్చించిన అనంతరం టికెట్ల జారీ విషయమై కీలక ప్రకటన చేశారు. వన్డే వరల్డ్‌కప్‌లో జరిగే మ్యాచ్‌లకు హాజరయ్యే అభిమానులు తప్పనిసరిగా ఫిజికల్‌ టికెట్లు(పేపర్‌ ప్రింటెడ్‌) తీసుకెళ్లాలని.. ఆన్‌లైన్‌ టికెట్లను(ఈ-టికెటింగ్‌) అనుమతించబోమని పేర్కొన్నారు. కాగా అభిమానులు ఫిజికల్‌ టికెట్లను పొందడానికి 7-8 కేంద్రాలను సిద్ధం చేసినట్లు తెలిపాడు. 

జై షా మాట్లాడుతూ.. ''మేం ఈసారి ఈ-టికెట్‌ని ఉపయోగించలేం. ఫిజికల్ టిక్కెట్లు పొందడానికి 7-8 కేంద్రాలు ముందుగానే ప్లాన్ చేశాం. అహ్మదాబాద్, లక్నో వంటి పెద్ద కెపాసిటీ స్టేడియంలలో ఈ-టికెట్ల నిర్వహణ చాలా కష్టం. మేం ముందుగా ద్వైపాక్షిక సిరీస్‌లలో ఈ-టికెటింగ్‌ని అమలు చేసి ఆపై ప్రపంచ కప్ వంటి పెద్ద టోర్నమెంట్‌లకు తీసుకెళ్లాలని మా ప్రణాళిక. ప్రపంచకప్ టిక్కెట్ల ధరతో సహా అన్నీ త్వరలో ప్రకటిస్తాం'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ నివేదిక ప్రకారం ప్రోటోకాల్‌లో భాగంగా ఐసీసీ, బీసీసీఐలు ఒక్కో గేమ్‌కు 300 హాస్పిటాలిటీ టిక్కెట్‌లను అందుకోనున్నాయి. ఇక రాష్ట్రాల క్రికెట్‌ అసోసియేషన్‌లు ఐసీసీకి 1295 లీగ్ గేమ్ టిక్కెట్లతో పాటు.. టీమిండియాకు సంబంధించిన 1355 టికెట్లను.. వీటితో పాటు సెమీ-ఫైనల్ మ్యాచ్‌ల టిక్కెట్లను కూడా అందించనుంది. మరో 500 జనరల్ టిక్కెట్లను మాత్రం సదరు క్రికెట్‌ అసోసియేషన్స్‌ బీసీసీఐకి ఉచితంగా అందించనున్నాయి.

చదవండి: Babar Azam: 'బ్రా' ధరించిన పాక్‌ కెప్టెన్‌.. షాక్‌ తిన్న ఫ్యాన్స్‌; వీడియో వైరల్‌

అతడిని ఎందుకు తీసుకున్నట్లు? ఫిఫ్టీ సాధించడం గొప్పేమీ కాదు.. కొత్తగా ఏం ఒరిగింది: మాజీ క్రికెటర్

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)