Breaking News

చెల్లి కోసం అన్న త్యాగం.. ఇప్పుడు ఏకంగా వరల్డ్‌కప్‌నే

Published on Mon, 11/03/2025 - 17:38

భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు ప్ర‌పంచాన్ని జ‌యించింది. ఐసీసీ మ‌హిళ‌ల వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2025 విజేత‌గా టీమిండియా నిలిచింది. ఆదివారం ముంబై వేదిక‌గా జ‌రిగిన తుది పోరులో 52 ప‌రుగుల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసిన హ‌ర్మ‌న్ సేన.. స‌రికొత్త వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌గా అవ‌త‌రించింది. మ‌న అమ్మాయిలు తమ అద్బుత పోరాటంతో విశ్వ‌వేదిక‌పై భారత జెండాను రెప‌రెపాలడించారు. ఒకే ఒక్క విజయంతో 140 కోట్ల మంది భారతీయులను తలెత్తుకునేలా చేశారు.  

కాగా ఈ చారిత్రత్మక విజయంలో స్టార్ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్‌ది కీలక పాత్ర. ఫైనల్ మ్యాచ్‌లో రేణుకా వికెట్లు పడగొట్టనప్పటికి.. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. పవర్ ప్లేలో బంతిని స్వింగ్ చేస్తూ ప్రోటీస్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టిన రేణుకా.. డెత్ ఓవర్లలోనూ తన పేస్‌ బౌలింగ్‌తో సత్తాచాటింది.

మొత్తంగా టోర్నీలో రేణుకా మూడు వికెట్లు పడగొట్టింది. అయితే రేణుకా సక్సెస్ వెనక ఆమె తల్లి సునీత కష్టం దాగి ఉంది. రేణుకా చిన్నతనంలోనే తన తండ్రి మరణించినప్పటికి.. తల్లి సునీత అన్ని తానే అయ్యి బిడ్డలను ఈ స్ధాయికి చేర్చింది.

తండ్రి క‌ల‌ను నేర‌వేర్చిన రేణుకా..
"మా ఆయనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. పిల్లల్లో ఎవరో ఒకరిని కబడ్డీ ప్లేయర్‌గా లేదా క్రికెటర్‌గా చూడాలని కలలు కన్నారు. కేహర్ సింగ్ ఇప్పుడు మాతో లేనప్పటికీ, మా అమ్మాయి తన కలను నెరవేర్చింది. చాలా సంతోషంగా ఉంది. నాకు మాటలు రావడం లేదు. రేణుకకు చిన్న తనం నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కువ.

తన స్కూల్‌డేస్‌లో అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడేది.  చెక్క బ్యాట్‌, వస్త్రాలతో చేసిన బాల్‌తో రోడ్డుపక్కన ఆడుతుండేది. ఫైన‌ల్ మ్యాచ్‌కు ముందు ఆమెతో నేను మాట్లాడాను. ఈ రోజు(ఫైన‌ల్లో) నీ కోసం కాదు.. దేశం కోసం ఆడు.  ప్రపంచ కప్ గెలుచుకురా అని చెప్పాను. మా అమ్మాయి ఈ రోజు ఈ స్థాయికి చేరినందుకు చాలా ఆనందంగా ఉంది. అమ్మాయిలంద‌రూ ఈ విధంగానే ముందుకు సాగాలి. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని.. నేను ఆ దేవుణ్ని ప్రార్ధిస్తున్నాన‌ని రేణుకా త‌ల్లి సునీత‌" ఓ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పేర్కొంది.

చెల్లి కోసం అన్న త్యాగం..
కాగా రేణుక తండ్రి కెహర్ సింగ్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అండ్ ప్రజా ఆరోగ్య శాఖలో పనిచేసేవారు. అయితే రేణుకకు మూడేళ్ల వయసు ఉన్నప్పుడే కెహర్ సింగ్ ఠాకూర్ మరణించారు. అయితే కెహ‌ర్‌కు కూడా క్రికెట్ అంటే పిచ్చి. అందుకే భార‌త స్టార్ క్రికెట‌ర్ వినోద్ కాంబ్లీ పేరు వ‌చ్చేలా త‌న కుమారుడికి వినోద్ ఠాకూర్ అని పేరు కెహ‌ర్ పెట్టాడు.

అయితే వినోద్ ఠాకూర్ కూడా క్రికెటర్ కావాల‌ని క‌ల‌లు కానేవాడంట‌. కానీ త‌న చెల్లి కోసం వినోద్ త‌న క‌ల‌ను వ‌దులుకున్నాడు. ఆర్ధిక క‌ష్టాలు ఉండ‌డంతో త‌నకు బ‌దులుగా రేణుకాను క్రికెట్ ఆకాడ‌మీలో జాయిన్‌ చేయాలని తల్లిని వినోద్ ఠాకూర్ సూచించాడు. అయితే రేణుకాలో టాలెంట్‌ను గుర్తించింది మాత్రం ఆమె మామ‌య్య భూపిందర్ ఠాకూర్.

ఆయ‌న రేణుకాకు అన్ని విధాల‌గా మ‌ద్ద‌తుగా నిలిచాడ‌ని ఆమె త‌ల్లి సునీత స్ప‌ష్టం చేసింది. ధర్మశాల క్రికెట్ అకాడమీలో రేణుకాను భూపిందర్ చేర్చాడు. అక్క‌డ నుంచే ఆమె క్రికెట్‌ కెరీర్ ప్రారంభమైంది.
చదవండి: Amanjot Kaur: మ్యాచ్‌ను మ‌లుపు తిప్పిన క్యాచ్‌..! అమ‌న్ వెనుక కన్నీటి గాథ
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)