Breaking News

రెండు నెల‌లు బ్యాట్‌ ట‌చ్ చేయ‌లేదు.. వింతగా అన్పించింది: స్టీవ్‌ స్మిత్‌

Published on Sun, 06/08/2025 - 12:04

వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్-2025 ఫైన‌ల్‌కు స‌మ‌యం అస‌న్న‌మ‌వుతోంది. జూన్ 11 నుంచి 15 వ‌ర‌కు ప్రతిష్టాత్మ‌క లార్డ్స్‌లో జ‌ర‌గ‌నున్న తుది పోరులో ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా జ‌ట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి రెండోసారి ఛాంపియ‌న్‌గా నిల‌వాల‌ని ఆస్ట్రేలియా భావిస్తుంటే.. మ‌రోవైపు ద‌క్షిణాఫ్రికా తొలి ఐసీసీ టైటిల్‌ను సొంతం చేసుకోవాల‌ని భాస్తోంది.

ఇప్ప‌టికే లండ‌న్‌కు చేరుకున్న ఇరు జ‌ట్లు ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నాయి. ఇక ఫైన‌ల్ పోరుకు ముందు త‌న ప్రాక్టీస్‌పై ఆసీస్ స్టార్ బ్యాట‌ర్ స్టీవ్ స్మిత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. రెండు నెల‌ల పాటు క‌నీసం బ్యాట్‌ను కూడా త‌ను ట‌చ్ చేయ‌లేద‌ని స్మిత్ చెప్పుకొచ్చాడు.

కాగా ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో సెమీఫైన‌ల్లో ఆసీస్ ఓట‌మి త‌ర్వాత‌.. స్మిత్ వ‌న్డేల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించి అంద‌రికి షాకిచ్చాడు. ఆ త‌ర్వాత త‌న స‌హ‌చ‌ర ఆట‌గాళ్లు కొంత‌మంది ఐపీఎల్‌లో పాల్గొంటే.. మ‌రి కొంత‌మంది డొమాస్టిక్ క్రికెట్‌లో ఆడారు. కానీ స్మిత్ మాత్రం న్యూయ‌ర్క్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకున్నాడు. త‌న తుంటి గాయంపై ట్రైనర్‌తో క‌లిసి ప‌నిచేశాడు.

"నేను సాధ‌ర‌ణంగా ఇంటిలో ఖాళీగా ఉంటే షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను. కానీ ఈసారి మాత్రం అందుకు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నాను. అందుకే న్యూయ‌ర్క్‌కు వెళ్లిపోయాను. నేను ఇక్క‌డికి వ‌చ్చి ప్రాక్టీస్‌లో తొలి షాట్ ఆడేంత‌వ‌ర‌కు క‌నీసం బ్యాట్‌ను కూడా ట‌చ్ చేయ‌లేదు.

చాలా రోజులు త‌ర్వాత బ్యాట్ ప‌ట్టుకుంటే చాలా కొత్త‌గా అన్పించింది. రెండు ప్రాక్టీస్ సెష‌న్ల‌ త‌ర్వాత నా ల‌య‌ను తిరిగి నేను అందుకున్నాను. ఇప్పుడు అంతా బాగానే ఉంది. ప్ర‌స్తుతం ఫిట్‌నెస్ పరంగా కూడా ఎటువంటి స‌మ‌స్య‌లు లేవు. 2014లో ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలానే ఉన్నాను. 

తుంటి గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాను. ఇప్పుడు తిరిగి స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేసేందుకు సిద్దంగా ఉన్నాను. నేను ఇప్ప‌టికీ ఓపెన‌ర్‌గా రాణించ‌గ‌ల‌న‌ని భావిస్తున్నాను. కానీ నేను ఆడిన గ‌త నాలుగు మ్యాచ్‌ల‌లో అంత మెరుగ్గా రాణించ‌లేక‌పోయాను. ఈ రోజుల్లో టాప్‌-4లో బ్యాటింగ్ చేసే ఎవ‌రైనా ఓపెన‌ర్‌గా రాణించ‌గ‌ల‌రు" అని స్మిత్ ఓ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నాడు.
చదవండి: IND vs ENG: వైభ‌వ్ సూర్య‌వంశీ సిక్స‌ర్ల వర్షం..! వీడియో వైర‌ల్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)