Breaking News

చ‌రిత్ర సృష్టించిన 17 ఏళ్ల కుర్రాడు.. హ్యాట్రిక్ వికెట్ల‌తో రికార్డు! వీడియో

Published on Sat, 07/19/2025 - 16:46

ఇంగ్లండ్ టీ20 బ్లాస్ట్‌లో నాటింగ్‌హామ్‌షైర్ యువ స్పిన్న‌ర్ ఫర్హాన్ అహ్మద్ సంచ‌ల‌నం సృష్టించాడు. శుక్రవారం ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా లంకాషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 ఏళ్ల ఫర్హాన్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. లంకాషైర్ ఇన్నింగ్స్ 20వ ఓవర్ వేసిన  ఫర్హాన్ అహ్మద్.. ఆఖరి మూడు బంతుల్లో వరుసగా ల్యూక్ వుడ్, టామ్ ఆస్పిన్‌వాల్,  మిచెల్ స్టాన్లేలను పెవిలియన్‌కు పంపాడు.

దీంతో అతడి ఖాతాలో తొలి హ్యాట్రిక్ చేరింది. అంతేకాకుండా టీ20 క్రికెట్‌లో నాటింగ్‌హామ్‌షైర్ తరపున హ్యాట్రిక్ సాధించిన తొలి ఆటగాడిగా కూడా అతడు రికార్డు సాధించాడు. ఈ ఫర్హాన్ ఎవరో కాదు, ఇంగ్లండ్ స్పిన్నర్ రెహాన్ ఆహ్మద్ తమ్ముడే.

గతేడాది జరిగిన అండర్‌-19 వరల్డ్‌కప్‌లో కూడా ఫర్హాన్ ఇంగ్లండ్ తరపున ఆడాడు. ఈ మ్యాచ్‌లో ఫ‌ర్హాన్ త‌న నాలుగు ఓవ‌ర్ల కోటాలో కేవ‌లం 25 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి ఐదు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ యువ సంచ‌ల‌నం ఇప్ప‌టికే నాటింగ్‌హామ్ త‌ర‌పున ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో కూడా అరంగేట్రం చేశాడు. త‌న డెబ్యూ మ్యాచ్‌లో 7 వికెట్లు ప‌డ‌గొట్టి స‌త్తాచాటాడు.

ఇక ఈ మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లంకాషైర్ 126 ప‌రుగుల‌కు ఆలౌటైంది. నాటింగ్‌హామ్ బౌల‌ర్ల‌లో ఫ‌ర్హాన్‌తో పాటు మోంట్‌గోమేరీ,ప్యాటర్సన్-వైట్ తలా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. అనంత‌రం 127 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నాటింగ్‌హామ్ 6 వికెట్లు కోల్పోయి చేధించింది.
చదవండి: IND vs ENG: టీమిండియాతో నాలుగో టెస్టు.. చ‌రిత్రకు అడుగు దూరంలో జో రూట్‌


 

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)