Breaking News

సెంచరీల మోత మోగించాడు.. టీమిండియాలో చోటు కొట్టేశాడు

Published on Tue, 02/13/2024 - 08:43

కర్ణాటక ఆటగాడు దేవదత్ పడిక్కల్‌కు తొలిసారి భారత టెస్టు జట్టులో చోటుదక్కింది. రాజ్‌​కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరగనున్న మూడో టెస్టుకు దూరమైన స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ స్ధానాన్ని పడిక్కల్‌తో సెలక్టర్లు భర్తీ చేశారు. ఈ మెరకు బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. "ఫిట్‌నెస్‌ సమస్యతో బాధపడుతున్న కేఎల్‌ రాహుల్‌ మూడో టెస్టుకు దూరమయ్యాడు.

అతడు ప్రస్తుతం తన గాయం నుంచి 90 శాతం మాత్రమే కోలుకున్నాడు.  అతని పరిస్థితిని బోర్డు మెడికల్‌ టీమ్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. రాహుల్‌ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ ఆకాడమీలో కోలుకుంటున్నాడు. అతడు తిరిగి నాలుగో టెస్టుకు అందుబాటులోకి వచ్చే ఛాన్స్‌ ఉంది. ఈ క్రమంలో మూడో టెస్టుకు రాహుల్‌ స్ధానంలో దేవదత్ పడిక్కల్‌ను సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసిందని" బీసీసీఐ పేర్కొంది.

పడిక్కల్‌ సెంచరీలు మోత..
ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ సీజన్‍లో కర్ణాటక తరపున పడిక్కల్ అదరగొడుతున్నాడు. పంజాబ్‍తో జరిగిన మ్యాచ్‍లో భారీ శతకంతో చెలరేగిన పడిక్కల్‌(193).. అనంతరం గోవాతో మ్యాచ్‍లోనూ సెంచరీతో దుమ్మురేపాడు. అక్కడతో కూడా పడిక్కల్‌ జోరు ఆగలేదు. ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరిగిన అనధికారిక టెస్టులో కూడా శతకంతో దేవ్‌దత్‌(105) మెరిశాడు.

అదేవిధంగా తాజాగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లోనూ విధ్వంసకర సెంచరీతో పడిక్కల్‌(151) చెలరేగాడు. పడిక్కల్ తన చివరి ఆరు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో ఒక హాఫ్ సెంచరీ, నాలుగు సెంచరీలను నమోదు చేశాడు. ప్రస్తుత రంజీ సీజన్‌లో 4 మ్యాచ్‌లు ఆడిన పడిక్కల్‌ 92.67 సగటుతో 556 పరుగులు చేశాడు.

ఓవరాల్‌గా తన ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో ఇప్పటివరకు 31 మ్యాచ్‌లు ఆడిన ఈ కర్ణాటక ఆటగాడు 2227 పరుగులు చేశాడు. కాగా పడిక్కల్‌ ఇప్పటికే భారత జట్టు తరపున టీ20ల్లో అరంగేట్రం చేశాడు. 2021లో శ్రీలంతో జరిగిన టీ20 సిరీస్‌తో పడిక్కల్‌ డెబ్యూ చేశాడు. అయితే మళ్లీ మూడేళ్ల తర్వాత భారత జట్టు నుంచి పడిక్కల్‌కు పిలుపురావడం గమనార్హం. ఇక ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌​కోట్‌ వేదికగా రెండో టెస్టు ఆరంభం కానుంది.
చదవండి: బంగ్లాదేశ్‌కు కొత్త కెప్టెన్‌ వచ్చేశాడు.. ఎవరంటే?


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)