Breaking News

వెర్‌స్టాపెన్‌కు ‘పోల్‌’

Published on Sun, 12/07/2025 - 03:08

అబుదాబి: ఫార్ములావన్‌ (ఎఫ్‌1) సీజన్‌ చివరి రేసులో రెడ్‌బుల్‌ రేసర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ ‘పోల్‌ పొజిషన్‌’ సాధించాడు. 24 రేసుల సీజన్‌లో అబుదాబీ గ్రాండ్‌ ప్రి చివరి రేసు కాగా... శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌ రేసులో డిఫెండింగ్‌ చాంపియన్‌ వెర్‌స్టాపెన్‌ ల్యాప్‌ను 1 నిమిషం 22. 207 సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచాడు. ఆదివారం జరగనున్న ప్రధాన రేసును వెర్‌స్టాపెన్‌ ‘పోల్‌ పొజిషన్‌’ నుంచి ప్రారంభించనున్నాడు. 

మెక్‌లారెన్‌ డ్రైవర్లు లాండో నోరిస్‌ 1 నిమిషం 22.408 సెకన్లు, ఆస్కార్‌ పియాస్ట్రి 1 నిమిషం 22.437 సెకన్లు వరుసగా రెండో, మూడో స్థానాలు దక్కించుకున్నారు. 2015 నుంచి అబుదాబి సర్క్యూట్‌లో పోల్‌ పొజిషన్‌ సాధించిన డ్రైవరే... ప్రధాన రేసులో విజేతగా నిలుస్తూ వస్తున్నాడు. మరి ఈ సారి కూడా అదే సంప్రదాయం కొనసాగుతుందా... లేక మెక్‌లారెన్‌ డ్రైవర్లు సత్తాచాటుతారా నేడు తేలనుంది.

ఈ సీజన్‌లో వెర్‌స్టాపెన్‌కు ఇది ఎనిమిదో పోల్‌ పొజిషన్‌ కాగా... ఓవరాల్‌గా కెరీర్‌లో 48వది. ఈ రేస్‌తోనే డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ విజేత తేలనున్నారు. నోరిస్‌ 408 పాయింట్లతో రేసులో ముందుండగా... నాలుగుసార్లు చాంపియన్‌ వెర్‌స్టాపెన్‌ 396 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. పియాస్ట్రి 392 పాయింట్లతో మూడో ‘ప్లేస్‌’లో ఉన్నాడు. వెర్‌స్టాపెన్‌ రేసులో విజేతగా నిలిచినా... నోరిస్‌ ‘టాప్‌–3’లో చోటు దక్కించుకుంటే అతడికే డ్రైవర్స్‌ చాంపియన్‌íÙప్‌ టైటిల్‌ దక్కనుంది.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)