Breaking News

వినూత్న సవాళ్లను ఎదుర్కొన్న కేఎల్‌ రాహుల్‌, బెన్‌ స్టోక్స్‌.. వైరల్‌ వీడియో

Published on Tue, 06/17/2025 - 12:10

జూన్‌ 20 నుంచి ప్రారంభం కాబోయే ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌కు ముందు భారత్‌, ఇంగ్లండ్‌కు చెందిన స్టార్‌ ఆటగాళ్లు కేఎల్‌ రాహుల్‌, బెన్‌ స్టోక్స్‌ పలు వినూత్న సవాళ్లను ఎదుర్కొన్నారు. అల్టిమేట్‌ క్రికెటింగ్‌ ఛాలెంజెస్‌ పేరుతో రెడ్‌ బుల్‌ సంస్థ ఈ పోటీలను నిర్వహించింది. 

ఇందులో రాహుల్‌, బెన్‌ నాలుగు కఠినమైన క్రికెటింగ్‌ ఛాలెంజ్‌లు ఎదుర్కొన్నారు. ఇవి వారి ఖచ్చితత్వం మరియు శక్తిని పరీక్షించేందుకు సరదాగా నిర్వహించబడ్డాయి. ఈ పోటీల్లో ఇరువురు బౌలింగ్‌ యంత్రాలను నుంచి వచ్చే బంతులను ఎదుర్కొని సవాళ్లను స్వీకరించారు.

మొదటి ఛాలెంజ్‌లో రాహుల్‌ ఓ భారీ ట్రక్‌పై బౌలింగ్‌ మిషన్‌ నుంచి వచ్చే పదునైన బంతులను ఎదుర్కొని భారీ షాట్ల ఛాలెంజ్‌ను ఫేస్‌ చేశాడు. ఈ ఛాలెంజ్‌లో రాహుల్‌ 8 బంతుల్లో కలిపి 500 మీటర్ల దూరం షాట్లు ఆడాలి. ఇందులో రాహుల్‌ చివరి బంతికి టార్గెట్‌ను రీచ్‌ అయ్యాడు.

రెండో చాలెంజ్‌లో బెన్ స్టోక్స్ ఓ సరస్సులో బోటుపై నిలబడి నీటిపై తేలియాడుతున్న ఆరు టార్గెట్లను బంతులతో హిట్ చేయాలి. ఇది కచ్చితమైన లక్ష్య నిర్దేశంతో కూడిన సవాలు. మూడో ఛాలెంజ్‌లో రాహుల్, స్టోక్స్ ప్రత్యేకంగా రూపొందించిన గదుల్లోకి వివిధ రకాలైన ఛాలెంజ్‌లను ఎదుర్కొన్నారు.

చివరిగా ఫైనల్ బాస్ పేరుతో ఇరువురికి ఓ కఠినమైన సవాలు ఎదురైంది. కదులుతూ, నిలకడగా ఉన్న లక్ష్యాలను బౌలింగ్‌ యంత్రాల నుంచి వచ్చే బంతులను ఎదుర్కొంటూ హిట్‌ చేయాలి. ఈ పోటీల్లో రాహుల్‌, స్టోక్స్‌ సమంగా రాణించారు. ఈ ఛాలెంజ్‌లకు సంబంధించిన వీడియో భారత్‌, ఇంగ్లండ్‌ టెస్ట్‌ సిరీస్‌కు ముందు క్రికెట్‌ అభిమానులను విపరీతంగా ఆకర్శిస్తుంది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)