Breaking News

చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌ పేసర్‌

Published on Fri, 11/06/2026 - 20:26

సిల్హెట్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ పేస‌ర్ హ‌స‌న్ మ‌హ‌మూద్ నిప్పులు చెరిగాడు. 27 ఏళ్ల హసన్‌ మ‌హ‌మూద్ తన సంచలన బౌలింగ్‌తో విండీస్‌ టాపార్డర్‌ను దెబ్బతీశాడు. మొత్తంగా తొలి ఇన్నింగ్స్‌లో హసన్‌ 6 వికెట్లతో సత్తాచాటాడు.

ఈ క్రమం‍లో అతడు ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో అత్యధికసార్లు ఫైవ్ వికెట్ హాల్స్ నమోదు చేసిన తొలి బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్‌గా హసన్ చరిత్ర సృష్టించాడు. హసన్ టెస్టు కెరీర్‌లో ఇది ఐదో ఐదు వికెట్ల ప్రదర్శన కావడం విశేషం. 

ఇంతకుముందు ఈ రికార్డు మాజీ పేసర్ షాహాదత్ హొసేన్ పేరిట ఉండేది. అతడు నాలుగు సార్లు టెస్టుల్లో ఐదు వికెట్ల ఘనత సాధించాడు. తాజా మ్యాచ్‌తో అతడి ఆల్‌టైమ్ రికార్డును హసన్ బ్రేక్ చేశాడు. కాగా హసన్ మహమూద్‌ స్వదేశంలో ఐదు వికెట్లు తీయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగులకు ఆలౌటైంది. విండీస్ అమీర్ జంగూ (133) భారీ సెంచరీతో కదం తొక్కగా.. కెవిన్ విక్‌హామ్(61) హాఫ్‌ సెంచరీ రాణించాడు. బంగ్లా బౌలర్లలో హసన్‌తో పాటు టాస్కిన్‌ అహ్మద్‌, మెహాది హసన్‌ మిరాజ్‌ తలా రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు. 

అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లా దేశ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. క్రీజులో తౌహిద్ హ్రిదోయ్(29), ముష్ఫికర్ రహీమ్(19) ఉన్నారు.
చదవండి: అఫ్గాన్‌ బౌలర్లకు చుక్కలు.. జింబాబ్వే 504 పరుగుల భారీ స్కోర్‌
 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)