Breaking News

Virat Kohli: ఇప్పట్లో చల్లారేలా లేదు! కోహ్లి మరో పోస్ట్‌ వైరల్‌! రియల్‌ బాస్‌ ఎవరంటే!

Published on Thu, 05/04/2023 - 10:32

IPL 2023- LSG Vs RCB: ఐపీఎల్‌-2023లో విరాట్‌ కోహ్లి- గౌతం గంభీర్‌ మధ్య వివాదం గురించి నెట్టింట్లో రచ్చ కొనసాగుతూనే ఉంది. గత మ్యాచ్‌లో గంభీర్‌ చర్యకు కోహ్లి బదులిచ్చాడని కింగ్‌ అభిమానులు అంటుండగా.. సీనియర్‌ అన్న గౌరవం లేదా అంటూ గౌతీ ఫ్యాన్స్‌ కోహ్లిపై ఫైర్‌ అవుతున్నారు. ఈ క్రమంలో ఈ గొడవలో ‘‘తప్పెవరిది’’ అన్న విషయం గురించి సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చోపర్చలు జరుగుతున్నాయి.

గంభీర్‌ ఫ్యాన్స్‌కు చురక!?
ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇన్‌స్టా పోస్ట్‌తో మరోసారి గంభీర్‌కు పరోక్షంగా కౌంటర్‌ ఇచ్చిన కోహ్లి.. బుధవారం మరో ఆసక్తికర వీడియో షేర్‌ చేశాడు. వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం వివియన్‌ రిచర్డ్స్‌ పాత ఇంటర్వ్యూ తాలూకు దృశ్యాలు పంచుకున్నాడు. ఇందుకు.. ‘‘ది రియల్‌ బాస్‌’’ అంటూ కోహ్లి క్యాప్షన్‌ జత చేయడంతో మరోసారి గంభీర్‌ అభిమానులకు చురక తగిలినట్లయింది.

ఈ వీడియోలో క్రికెట్‌ డిస్ట్రిక్ట్‌తో రిచర్డ్స్‌ ముచ్చటిస్తూ..  పొట్టి ఫార్మాట్‌లో వివిధ లీగ్‌లలో ఆడటాన్ని తాను ఇష్టపడతానని పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్‌ ఆడీ ఆడీ బోర్‌ కొట్టిందని.. ఇప్పుడు ఐపీఎల్‌ లేదంటే సీపీఎల్‌ వంటి లీగ్‌లలో ఆడాలని ఉందని చెప్పుకొచ్చాడు. కాగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో సోమవారం (మే 1) నాటి మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్‌ కోహ్లి- లక్నో మెంటార్‌ గంభీర్‌ మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే.

గంభీర్‌ అలా.. కోహ్లి ఇలా!
అంతకు ముందు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీపై తమ విజయానంతరం గంభీర్‌..ఆర్సీబీ ఫ్యాన్స్‌ను నోరు మూసుకోవాలి అన్నట్లు సైగతో ట్రోల్‌ చేశాడు. అయితే, ఈ విషయాన్ని తేలికగా వదిలిపెట్టని కోహ్లి.. లక్నోలో తమ విజయం నేపథ్యంలో ఆద్యంతం గంభీర్‌, లక్నో జట్టును కవ్వించేలా సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడు.

నవీన్‌ ఉల్‌ హక్‌ కారణంగా
ఇక ఆర్సీబీ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌లో ఫ్రీ హిట్‌ నేపథ్యంలో లక్నో టెయిలెండర్‌ నవీన్‌ ఉల్‌ హక్‌తో అతడికి తలెత్తిన గొడవలో కోహ్లి జోక్యంతో వివాదానికి దారితీసింది. ఈ క్రమంలో కోహ్లిని ఆపడానికి మరో ఎండ్‌లో ఉన్న అమిత్‌ మిశ్రా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. మ్యాచ్‌  అనంతరం కరచాలనం చేసుకునే సమయంలో నవీన్‌ కోహ్లితో అనుచితంగా ప్రవర్తించడం.. గంభీర్‌ సహా మేయర్స్‌ జోక్యం చేసుకోవడంతో వివాదం పెద్దదైంది.  లక్నో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ మాత్రం నవీన్‌కు సర్దిచెప్తూ సున్నితంగానే కోహ్లిని వారించే ప్రయత్నం చేశాడు.

వాళ్లిద్దరే
ఈ గొడవ నేపథ్యంలో కోహ్లి, గంభీర్‌ మ్యాచ్‌ ఫీజులో వంద శాతం కోత విధిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ ఘటనపై ఇప్పటికీ తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జెంటిల్మన్‌ గేమ్‌కు మాయని మచ్చ తెచ్చారంటూ పలువురు భారత మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. కాగా రిచర్డ్స్‌పై ఎల్లప్పుడూ అభిమానం చాటుకునే కోహ్లి.. గతంలో ఓసారి.. ‘‘ సచిన్‌ టెండుల్కర్‌, వివియన్‌ రిచర్డ్స్‌ మాత్రమే GOAT(గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌)’’ అని పేర్కొన్నాడు. 

చదవండి: #ViratGambhirFight: మిమ్మల్ని అనలేదు.. నా వాళ్లను అన్నావు! కోహ్లి- గంభీర్‌ గొడవ.. జరిగిందిదే: ప్రత్యక్ష సాక్షి

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)