Breaking News

చెత్త ఫీల్డింగ్‌తో మూడు లైఫ్‌లు.. సిక్సర్లతో రికార్డులకెక్కాడు

Published on Wed, 04/26/2023 - 21:12

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ దారుణ ఫీల్డింగ్‌ కనబరిచింది. ముఖ్యంగా కేకేఆర్‌ కెప్టెన్‌ నితీశ్‌ రానా ఆర్‌సీబీ చెత్త ఫీల్డింగ్‌ వల్ల మూడుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు.  తొలుత నితీష్‌ 12 పరుగుల వద్ద ఉన్నప్పుడు విజయ్‌కుమార్‌ బౌలింగ్‌లో లాంగాఫ్‌ దిశగా షాట్‌ ఆడగా.. సిరాజ్‌ చేతిలోకి వచ్చిన క్యాచ్‌ను వదిలేశాడు.

ఇక రెండోసారి సిరాజ్‌ బౌలింగ్‌ఓ ఫైన్‌లెగ్‌ దిశగా ఆడగా.. అక్కడే ఉన్న ఫీల్డర్‌ మరోసారి క్యాచ్‌ను జారవిడిచాడు. ఇక ముచ్చటగా మూడోసారి మ్యాక్స్‌వెల్‌ వదిలేశాడు. హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో రానా లాంగాన్‌ దిశగా ఆడగా.. మ్యాక్స్‌వెల్‌ కాస్త వేగంగా స్పందించి ఉంటే ఉంటే క్యాచ్‌ దొరికేది. ఇలా మూడుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న నితీశ్‌ రానా చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. 


Photo: IPL Twitter

కేకేఆర్‌ తరపున అత్యధిక సిక్సర్ల రికార్డు
సిక్సర్లతో చిన్నస్వామి స్టేడియాన్ని హోరెత్తించాడు. మొత్తంగా 21 బంతుల్లో 4 సిక్సర్లు, మూడు ఫోర్ల సాయంతో 48 పరుగులు చేసి హసరంగా బౌలింగ్‌లో వెనుదిరిగాడు.  ఈ క్రమంలోనే నితీశ్‌ రానా ఒక రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలో కేకేఆర్‌ తరపున అత్యధిక సిక్సర్లు బాదిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు.

ఆర్‌సీబీతో మ్యాచ్‌లో నితీశ్‌ రానా కొట్టిన నాలుగు సిక్సర్లతో వంద సిక్సర్ల మార్క్‌ను అందుకున్నాడు. ఈ జాబితాలో ఆండ్రీ రసెల్‌ 180 సిక్సర్లతో తొలిస్థానంలో ఉండగా.. వంద సిక్సర్లతో నితీశ్‌ రానా రెండో స్థానంలో, 85 సిక్సర్లతో యూసఫ్‌ పఠాన్‌, రాబిన్‌ ఊతప్పలు సంయుక్తంగా మూడోస్థానంలో ఉన్నారు.

చదవండి: #JasonRoy: 4 బంతుల్లో నాలుగు సిక్సర్లు.. షాబాజ్‌ అహ్మద్‌ను ఉతికారేశాడు

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)