Breaking News

RCB Vs PBKS: ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్‌ నుంచి పంజాబ్‌ ఔట్‌

Published on Thu, 05/09/2024 - 23:59

ఐపీఎల్ 2024లో పంజాబ్‌ కింగ్స్‌ కథ ముగిసింది. ప్లేఆఫ్ ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్‌ ఓడిపోయింది. ధర్మశాల వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో పంజాబ్‌  పరాజయం పాలైంది. 

242 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ కింగ్స్‌.. 17 ఓవర్లలో 181 పరుగులకే ఆలౌటైంది. ఆర్సీబీ బౌలర్లలో పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. లూకీ ఫెర్గూసన్‌, కరణ్‌ శర్మ, స్వప్నిల్‌ చెరో రెండు వికెట్లు సాధించారు.

పంజాబ్‌ బ్యాటర్లలో రిలీ రూసో(61) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. శశాంక్ సింగ్‌‌(37) కాసేపు మెరుపులు మెరిపించాడు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ 7 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. 

ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి మరోసారి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. 47 బంతులు ఎదుర్కొన్న విరాట్‌.. 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 92 పరుగులు చేసి ఔటయ్యాడు. 

కోహ్లితో పాటు రజిత్ పాటిదార్‌(55), కామెరాన్ గ్రీన్(46) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు పడగొట్టగా.. విధ్వత్ కావేరప్ప రెండు,  అర్ష్‌దీప్ సింగ్‌, సామ్ కుర్రాన్ తలా రెండు వికెట్లు సాధించారు.  ఇక ఈ విజయంతో ఆర్సీబీ తమ ప్లే ఆఫ్స్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)