ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పులు.. ల‌క్నో వేదిక‌గా ఆర్సీబీ మ్యాచ్‌లు

Published on Tue, 05/20/2025 - 19:39

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 షెడ్యూల్‌లో బీసీసీఐ స్వ‌ల్ప మార్పులు చేసింది.  ఈ ఏడాది సీజ‌న్‌లో బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆడాల్సిన ఆఖ‌రి రెండు లీగ్ మ్యాచ్‌ల‌ను ల‌క్నో మార్చారు. బెంగ‌ళూరులో భారీ వ‌ర్షాల కార‌ణంగా బీసీసీఐ ఈ నిర్ణ‌యం తీసుకుంది. 

ఆర్సీబీ త‌మ తదుపరి రెండు మ్యాచ్‌ల్లో మే 23న స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, మే 27న ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో బెంగ‌ళూరు వేదిక‌గా త‌ల‌ప‌డాల్సి ఉంది. ఇప్పుడు రీ షెడ్యూల్ చేయ‌డంతో ఈ రెండు మ్యాచ్‌ల‌నీ ల‌క్నో లోని ఏక్నా క్రికెట్ స్టేడియంలో ఆర్సీబీ ఆడ‌నుంది.

"ఐపీఎల్‌-2025లో ఆర్సీబీ, ఎస్ఆర్‌హెచ్ మ‌ధ్య జ‌ర‌గాల్సిన మ్యాచ్‌ను ల‌క్నోకు త‌ర‌లించాము. బెంగ‌ళూరులో వర్షాల కార‌ణంగా ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింది. ఆర్సీబీ-ల‌క్నో మ్యాచ్ కూడా అదే వేదిక‌లో జ‌ర‌గ‌నుంది" అని బీసీసీఐ ఓ ప్ర‌కట‌న‌లో పేర్కొంది. కాగా ఇప్పటికే బెంగళూరు వేదికగా ఆర్సీబీ-కేకేఆర్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వేదికను భారత క్రికెట్‌ బోర్డు మార్చింది.

మరోవైపు ప్లే ఆఫ్స్‌, ఫైనల్‌ వేదికలను కూడా బీసీసీఐ ఖరారు చేసింది. మే 29న జరిగే క్వాలిఫయర్ 1, మే 30న జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లకు ముల్లాన్‌పుర్‌ ఆతిథ్యమిస్తుంది. క్వాలిఫయర్ 2 (జూన్  1), ఫైనల్ (జూన్ 3) అహ్మదాబాద్‌లో జరుగుతాయి.
చదవండి: ఆ యంగ్ క్రికెట‌ర్‌కు నేను హాగ్ ఇవ్వ‌లేదు: ప్రీతి జింటా
 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)