Breaking News

కలలో కూడా ఊహించలేదు.. రాసి పెట్టి ఉంది: రజత్‌ పాటిదార్‌

Published on Mon, 06/01/2026 - 10:12

19 ఎడిషన్ల ఐపీఎల్‌ చరిత్రలో తొలి 17 ఎడిషన్లు టైటిల్‌ కోసం ముఖం వాచిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంచైజీ.. ఇప్పుడు వరుసగా రెండో ఎడిషన్‌లో టైటిల్‌ సాధించి కరువు తీర్చుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిన్న (మే 31) జరిగిన 2026 ఎడిషన్‌ ఫైనల్లో ఆ జట్టు గుజరాత్‌ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొంది, టైటిల్‌ను నిలబెట్టుకుంది.

ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ ఆర్సీబీకి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. సీజన్‌ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన ఆ జట్టు టాపార్డర్‌, బౌలింగ్‌ విభాగాలు తుది సమరంలో చేతులెత్తేశాయి. తొలుత బ్యాటింగ్‌లో సాధారణ స్కోర్‌కు (155-8) పరిమితమైన గుజరాత్‌.. ఆతర్వాత దాన్ని కాపాడుకోవడంలో దారుణంగా విఫలమైంది. విరాట్‌ కోహ్లి (75 నాటౌట్‌) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు.

ఈ సీజన్‌ ప్రారంభం నుంచి గుజరాత్‌ విజయాల్లో ప్రధానపాత్ర పోషించిన బౌలర్లు, ఆఖరి మెట్టుపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. 9వ ఓవర్‌లో రషీద్‌ ఖాన్‌ రెండు వికెట్లు (రజత్‌, కృనాల్‌) తీయడం మినహాయించి, ఏ దశలోనూ బౌలర్లు ప్రభావం చూపించలేకపోయారు. కాస్త పొదుపుగా బౌలింగ్‌ చేయగలిగినా, స్కోర్‌ మరీ చిన్నది కావడంతో కాపాడుకోలేకపోయారు.

ఈ మ్యాచ్‌ అనంతరం విన్నింగ్‌ కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. వరుసగా రెండో ఏడాది టైటిల్‌ సాధించడంతో అతని​ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ట్రోఫీని అందుకున్న తర్వాత మాట్లాడుతూ..

IPL 2026 : RCB  Players Celebrate With the Trophy After Winning 3

ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించి వరుసగా రెండు టైటిళ్లు గెలిపిస్తానని కలలో కూడా ఊహించలేదన్నాడు. టాస్ గెలిస్తే ఛేజ్ చేయడమే తమ ప్రణాళిక అని, పవర్‌ప్లేలోనే గుజరాత్ టాప్-3 బ్యాటర్లను ఔట్ చేయాలని ముందుగానే వ్యూహం సిద్ధం చేసుకున్నామని తెలిపాడు. ఆ ప్లాన్‌ను బౌలర్లు అద్భుతంగా అమలు చేశారని ప్రశంసించాడు.

భువీ, హాజిల్‌వుడ్‌, రసిక్‌, కృనాల్‌, సుయాశ్‌ సీజన్ మొత్తం అద్భుతంగా రాణించారని కొనియాడాడు. గతేడాది తొలి టైటిల్ గెలవాలనే ఒత్తిడి ఎక్కువగా ఉండేదని, ఈసారి మాత్రం జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిందని చెప్పుకొచ్చాడు. సీజన్‌ ప్రారంభం నుంచి మంచి క్రికెట్ ఆడటమే తమకు ధైర్యాన్ని ఇచ్చిందన్నాడు.

IPL 2026 : RCB  Players Celebrate With the Trophy After Winning 9

తన బ్యాటింగ్‌లో మెరుగుదల కోసం టోర్నీకి ముందు ప్రత్యేకంగా శ్రమించానని, వేగవంతమైన బౌలర్లపై కొన్ని షాట్లను మెరుగుపర్చుకునేందుకు కృషి చేశానని తెలిపాడు. ఈ క్రమంలో దినేశ్‌ కార్తీక్‌, విరాట్‌ కోహ్లి సహా పలువురు సీనియర్ల నుంచి విలువైన సూచనలు అందాయని చెప్పాడు.

కోహ్లీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ.. మైదానంలోనూ, బయటా జట్టు కోసమే ఆలోచిస్తాడు. ముఖ్యంగా కొత్త ఆటగాళ్ల వద్దకు తానే వెళ్లి మాట్లాడతాడు. వారికి ధైర్యం ఇస్తాడు. జట్టుకు అతను గొప్ప బలమని కొనియాడాడు.

చివరగా అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ "ఈసారి కూడా కప్ మనదే (Ee Sala Nu Cup Namdu) అంటూ అభిమానులకు ట్రోఫీని అంకితం చేశాడు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)