Breaking News

ఆర్సీబీకి సంబంధించి మరో బిగ్‌ న్యూస్‌

Published on Thu, 11/06/2025 - 11:29

ఆర్సీబీ (RCB) ఫ్రాంచైజీకి సంబంధించి మరో బిగ్‌ న్యూస్‌ అందింది. తొలుత ఫ్రాంచైజీ అమ్మకానికి పెట్టిన వార్త రాగా.. తాజాగా మహిళల ఆర్సీబీ కొత్త హెడ్‌ కోచ్‌ను (Malolan Rangarajan) నియమించుకుందన్న వార్త వెలువడింది. ఈ విషయాన్ని ఆర్సీబీ అధికారిక ట్విటర్‌ ఖాతా ద్వారా వెల్లడించింది. మలోలన్‌ రంగరాజన్‌ తమిళనాడుకు చెందిన మాజీ క్రికెటర్‌.

రంగరాజన్  గతంలో ఆర్సీబీ పురుషులు, మహిళల జట్లకు స్కౌట్, ఫీల్డింగ్ కోచ్‌గా పని చేశారు. 2024 సీజన్‌లో ఆర్సీబీ​ని ఛాంపియన్‌గా నిలిపిన ల్యూక్ విలియమ్స్  వేరే కోచింగ్‌ కమిట్‌మెంట్స్‌ కారణంగా ఆర్సీబీని వీడారు. వచ్చే సీజన్‌ నుంచి మలోలన్‌ ల్యూక్‌ విలియమ్స్‌ స్థానాన్ని భర్తీ చేస్తారు.

మ‌రోవైపు ఇంగ్లండ్ మాజీ పేస‌ర్ అన్యా ష్రబ్సోల్ (Anya Shrubsole)ను ఆర్సీబీ త‌మ బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేసింది. అన్యా గ‌తంలో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధానతో కలిసి 'ది హండ్రెడ్'లో సదరన్ బ్రేవ్ తరఫున ఆడింది.  ష్రబ్సోల్..గ‌త సీజ‌న్ వ‌ర‌కు బౌలింగ్ కోచ్‌గా ప‌నిచేసిన‌ సునేత్ర పరంజాపే స్థానంలో బాధ్యతలు చేప‌ట్ట‌నుంది.

అమ్మకానికి ఆర్సీబీ
పురుషుల ఐపీఎల్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అయిన ఆర్సీబీని అమ్మకానికి పెట్టినట్లు యాజమాన్యం (డియాజియో కంపెనీ) అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు బాంబే స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌కు కూడా సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది. 

ఫ్రాంచైజీలో పెట్టుబడిదారుల కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపింది. కొత్త యజమానులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సం ముగిసే నాటికి... అంటే వచ్చే మార్చి 31వ తేదీకల్లా విక్రయ ప్రక్రియ పూర్తిచేయనుంది.

చదవండి: సీఎస్‌కే అభిమానులకు శుభవార్త
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)