Breaking News

చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. ఐపీఎల్ హిస్టరీలోనే

Published on Wed, 05/28/2025 - 09:30

ఐపీఎల్-2025 సీజ‌న్ త‌మ ఆఖ‌రి లీగ్ మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఆసాధ‌ర‌ణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. సోమ‌వారం ఏకానా స్టేడియం వేదిక‌గా లక్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘ‌న విజ‌యం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ క్వాలిఫయర్‌-1కు ఆర్హత సాధించింది. ల‌క్నో నిర్ధేశించిన 228 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని బెంగ‌ళూరు కేవ‌లం నాలుగు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ఊదిప‌డేసింది.

ఆర్సీబీ బ్యాటర్లలో స్టాండ్‌ ఇన్ కెప్టెన్ జితేష్ శ‌ర్మ‌(33 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌ల‌తో 85 నాటౌట్‌) విధ్వంసం సృష్టించగా.. విరాట్ కోహ్లి(30 బంతుల్లో 10 ఫోర్లతో 54), మయాంక్ అగర్వాల్‌(23 బంతుల్లో 41 నాటౌట్‌), సాల్ట్(30) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. లక్నో బౌలర్లలో విలియం​ ఓ రూర్క్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఆకాష్‌, అవేష్ ఖాన్ తలా వికెట్ సాధించారు. 

అంతకుముం‍దు బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రిషభ్‌ పంత్‌ (61 బంతుల్లో 118 నాటౌట్‌; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు) సీజన్‌లో తొలి సెంచరీతో చెల‌రేగ‌గా, మిచెల్‌ మార్ష్ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్ సెంచ‌రీతో మెరిశాడు.

ఆర్సీబీ స‌రికొత్త చ‌రిత్ర‌..
ఇక ఈ మ్యాచ్‌లో అద్బుత విజయం సాధించిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు అరుదైన రికార్డును త‌మ ఖాతాలో వేసుకుంది. ఒక ఐపీఎల్ సీజ‌న్‌లో ప్ర‌త్య‌ర్ధి జ‌ట్ల‌తో వాటి హోం గ్రౌండ్స్‌లో జ‌రిగిన అన్నీ మ్యాచ్‌ల‌లోనూ గెలుపొందిన తొలి టీమ్‌గా ఆర్సీబీ చ‌రిత్ర సృష్టించింది.

ఈ ఏడాది సీజన్ తొలి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్‌ను ఓడించిన ఆర్సీబీ.. ఆ తర్వాత సీఎస్‌కే, ముంబై ఇండియన్స్‌, రాజస్తాన్ రాయల్స్‌, పంజాబ్ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, లక్నో సూపర్ జెయింట్స్‌ను వారి సొంత మైదానాల్లోనే చిత్తు చేసింది.
చదవండి: IND vs ENG: బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం.. దిలీప్‌కు మ‌ళ్లీ పిలుపు

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)