Breaking News

‘బీసీసీఐ’ సూచన.. కీలక టోర్నీ నుంచి ఆర్సీబీ కెప్టెన్‌ అవుట్‌!

Published on Thu, 07/24/2025 - 16:33

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ (Rajat Patidar) కీలక దేశవాళీ టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. ఐపీఎల్‌-2025 తర్వాత కాంపిటేటివ్‌ క్రికెట్‌కు దూరంగా ఉన్న ఈ మధ్యప్రదేశ్‌ బ్యాటర్‌.. ఈ ఏడాది దులిప్‌ ట్రోఫీ ఆడలేకపోతున్నాడు.

కాగా ఆర్సీబీ పదిహేడేళ్ల కలకు తెరదించుతూ ఈసారి ఆ జట్టుకు ట్రోఫీ అందించాడు రజత్‌ పాటిదార్‌. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా సత్తా చాటి.. ఆర్సీబీ దిగ్గజం విరాట్‌ కోహ్లికి కూడా సాధ్యంకాని విధంగా టైటిల్‌ గెలిచి ఆర్సీబీని ఖుషీ చేశాడు. అయితే, టోర్నీ మధ్యలోనే రజత్‌ వేలికి గాయమైంది.

బీసీసీఐ వైద్యుల సూచన మేరకు
ఈ క్రమంలో మళ్లీ ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడినప్పటికీ రజత్‌ పాటిదార్‌ ఇంకా గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని సమాచారం. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) వైద్యుల సూచన మేరకు అతడు మరికొంత కాలం విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అందుకే దులిప్‌ ట్రోఫీ మ్యాచ్‌లకు రజత్‌ దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ విషయం గురించి రజత్‌ పాటిదార్‌ సన్నిహిత వర్గాలు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘మధ్య ప్రదేశ్‌ ఆఫ్‌- సీజన్‌ శిక్షణా శిబిరంలో రజత్‌ పాల్గొన్నాడు. అయితే, తను బ్యాటింగ్‌ మాత్రం చేయలేదు. బీసీసీఐ వైద్య బృందం అతడిని మరికొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించింది.

దులిప్‌ ట్రోఫీకి దూరం..
కుడిచేతి వేలికి అయిన గాయం పూర్తిగా నయమైన తర్వాతే అతడు మళ్లీ బ్యాట్‌ పట్టనున్నాడు. దులిప్‌ ట్రోఫీలో ఈసారి అతడు పాల్గొనలేకపోతున్నాడు. అయితే, రంజీ ట్రోఫీ నాటికి అతడు తిరిగి వస్తాడు’’ అని పేర్కొన్నాయి. 

కాగా 2024లో రజత్‌ పాటిదార్‌ టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి 63 పరుగులు చేశాడు.

షెడ్యూల్‌ ఇదే
ఇక ఇప్పటి వరకు ఒకే ఒక్క వన్డే ఆడిన రజత్‌.. అంతర్జాతీయ టీ20లలో ఇంత వరకు అడుగుపెట్టలేదు. ఇక ఐపీఎల్‌-2025లో సత్తా చాటిన రజత్‌ పాటిదార్‌ను ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్‌కు పరిశీలించారు. కానీ గాయం వల్ల అతడికి అవకాశం రాలేదు.

కాగా ఆగష్టు 28- సెప్టెంబరు 15 వరకు దులిప్‌ ట్రోఫీ-2025 నాకౌట్‌ మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది.  తొలి క్వార్టర్‌ ఫైనల్లో నార్త్‌ జోన్‌ - ఈస్ట్‌ జోన్‌ తలపడనుండగా.. రెండో క్వార్టర్స్‌ మ్యాచ్‌లో సెంట్రల్‌ జోన్‌- నార్త్‌ ఈస్ట్‌ జోన్‌ను ఢీకొట్టనుంది. ఇక ఇప్పటికే సౌత్‌ జోన్‌, వెస్ట్‌ జోన్‌ సెమీ ఫైనల్‌ చేరగా.. సెమీస్‌ ఫలితాల తర్వాత సెప్టెంబరు 11- 15 వరకు ఫైనల్‌ జరుగనుంది.

చదవండి: నాకు ఇలానే జ‌రిగింది.. అదే అయితే పంత్ ఆడ‌డం క‌ష్ట‌మే: పాంటింగ్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)