RCB Vs PBKS: నేను అత‌డికి పెద్ద అభిమానిని.. ఇంకా ఒకే ఒక మ్యాచ్‌: ఆర్సీబీ కెప్టెన్‌

Published on Fri, 05/30/2025 - 08:17

ఐపీఎల్‌-2025 ఫైన‌ల్లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు అడుగుపెట్టింది. గురువారం ముల్లాన్‌పూర్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన తొలి క్వాలిఫ‌య‌ర్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఆర్సీబీ.. తొమ్మిదేళ్ల తర్వాత ఈ క్యాష్ రిచ్ లీగ్ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్‌.. ఆర్సీబీ బౌలర్ల ధాటికి 101 పరుగులకే ఆలౌటైంది.

బెంగళూరు బౌలర్లలో సుయాష్ శర్మ, హాజిల్‌వుడ్ తలా మూడు వికెట్లు పడగొట్టి పంజాబ్ పతనాన్ని శాసించగా.. యశ్‌దయాల్ రెండు, షెఫర్డ్‌, భువనేశ్వర్ కుమార్ తలా వికెట్ సాధించారు. పంజాబ్ బ్యాటర్లలో స్టోయినిష్‌(26) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 102 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.

ఆర్సీబీ బ్యాటర్లలో ఫిల్‌ సాల్ట్‌ (27 బంతుల్లో 56 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగగా..మయాంక్‌(19), కోహ్లి(12) పర్వాలేదన్పించారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్‌​ స్పందించాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’  సుయాష్ శర్మపై రజత్ ప్రశంసల వర్షం కురిపించాడు.

"ఈ మ్యాచ్‌లో స్పష్టమైన బౌలింగ్‌ ప్రణాళికలతో బరిలోకి దిగాము. మా ఫాస్ట్ బౌలర్లు పిచ్ కండీషన్స్‌ను బాగా ఉపయోగించుకున్నారు. ఇక సుయాష్ శర్మ గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. అతడు బౌలింగ్ చేసిన విధానం ఒక అద్బుతం. చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌లతో బౌలింగ్ చేసి ప్రత్యర్ధి బ్యాటర్లను కట్టడి చేశాడు. 

కెప్టెన్‌గా అతడి బౌలింగ్‌పై నాకు ఒక క్లారిటీ ఉంది. స్టంప్స్ లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ చేయడమే అతడి బలం. సూయూష్ బౌలింగ్‌ను ఆర్దం చేసుకోవడం బ్యాటర్లకు చాలా కష్టం.  నేనెప్పుడూ అతడిని కన్ఫ్యూజ్ చేయలేదు. ప్రతీ మ్యాచ్‌లోనూ అతడికి సపోర్ట్‌గా ఉన్నాము.

 ఈ క్రమంలో అతను కొన్ని పరుగులు ఇచ్చినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ టోర్నీ అసాంతం మేము చాలా మేము చాలా ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గోన్నాము. కాబట్టి ఒక రోజు ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల ఎలాంటి నష్టం లేదు. ఇక ఫిల్ సాల్ట్ ప్రతీ మ్యాచ్‌లోనూ మాకు అద్బుతమైన ఆరంభాలను అందించాడు. ఈ మ్యాచ్‌లో మరోసారి తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. అతడికి నేను పెద్ద అభిమానిని. 

డగౌట్ నుంచి అతడి ఆటను చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. చిన్నస్వామిలోనే కాదు మేము ఎక్కడికి వెళ్లినా మాకు సపోర్ట్‌గా నిలుస్తున్న ఆర్సీబీ అభిమానులకు ధన్యవాదాలు. మిమ్మల్ని మేము ప్రేమిస్తునే ఉంటాము, మీరు కూడా మాకు మద్దతు ఇస్తూ ఉండండి. మరో మ్యాచ్ మిగిలి ఉంది. ఆ తర్వాత కలిసి సెలబ్రేట్ చేసుకుందాం" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో పాటిదార్ పేర్కొన్నాడు.
చదవండి: తొమ్మిదేళ్ల తర్వాత తుది పోరుకు...
 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)