Breaking News

'అత‌డొక అద్భుతం.. ఆర్సీబీ ప్లాన్ ఇదే'

Published on Fri, 11/21/2025 - 09:13

ఐపీఎల్‌-2026 వేలానికి ముందు డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ లియామ్ లివింగ్‌స్టోన్‌ను విడిచిపెట్టిన సంగ‌తి తెలిసిందే. గ‌త సీజ‌న్ మెగా వేలంలో లివింగ్‌స్టోన్‌ను రూ.8.75 కోట్ల భారీ ధ‌ర‌కు ఆర్సీబీ  కొనుగోలు చేసింది. కానీ ఆర్సీబీ యాజ‌మాన్యం న‌మ్మ‌కాన్ని ఈ ఇంగ్లీష్ క్రికెట‌ర్ నిల‌బెట్టుకోలేక‌పోయాడు.

ఎనిమిది మ్యాచ్‌ల‌లో కేవ‌లం 16 సగటుతో 112 ప‌రుగులు చేసి తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. దీంతో అత‌డిని వేలంలో బెంగ‌ళూరు ఫ్రాంచైజీ విడిచిపెట్టింది. వారి ప‌ర్స్ బ‌లాన్ని పెంచుకోవడం కోసం ఆర్సీబీ ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఈ నేప‌థ్యంలో బెంగ‌ళూరు జ‌ట్టుకు టీమిండియా మాజీ ప్లేయ‌ర్ మ‌హ్మ‌ద్ కైఫ్ కీల‌క సూచ‌న చేశాడు.

వ‌చ్చే నెల‌లో జ‌ర‌గ‌నున్న మినీ వేలంలో లివింగ్‌స్టోన్‌ను తక్కువ ధరకు తిరిగి కొనుగోలు చేయాలని కైఫ్ అభిప్రాయపడ్డాడు. కృనాల్ పాండ్యా, సుయాష్ శర్మతో పాటు మూడో స్పిన్నర్‌గా లివింగ్‌స్టోన్‌ను ఉపయోగించుకోవచ్చని అతడు తెలిపాడు.

"ఐపీఎల్‌-2026 మినీ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  లియామ్ లివింగ్‌స్టోన్‌ను తిరిగి కొనుగోలు చేసే అవకాశం ఉంది. వారు తమ పర్స్ బలాన్ని పెంచుకోవడం కోసం అతడిని వేలంలోకి విడిచిపెట్టి ఉం‍డొచ్చు. గత సీజన్‌లో లివింగ్‌స్టోన్‌పై భారీ మొత్తాన్ని వెచ్చించారు. 

కాబట్టి  ఈసారి ఆ మొత్తంతో ఇద్దరు ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఆర్సీబీ ప్రయత్నించవచ్చు. లివింగ్‌స్టోన్‌కు అద్భుతమైన ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. ఆర్సీబీ ఒకవేళ పుణే(హోం గ్రౌండ్‌)లో ఆడితే అతడు మూడో స్పిన్నర్‌గా ఉపయోగపడతాడు.

అదేవిధంగా వేలంలో ఉత్తరాఖండ్ పేసర్ ఆకాశ్ మధ్వల్ కోసం ఆర్సీబీ ప్రయత్నించాలి. గత సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ అతడిని సరిగ్గా ఉపయోగించుకోలేదు. అతడు చాలా తక్కువ మ్యాచ్‌లు ఆడాడు. పిచ్ కాస్త డ్రైగా ఉంటే అతడు బంతిని అద్భుతంగా సీమ్ చేయగలడు. అదే అతడి బలం" అని తన యూట్యూబ్ ఛానల్‌లో కైఫ్ పేర్కొన్నాడు. 

మరోవైపు.. రిలీజ్‌ జాబితా విడుదల చేయడానికి ముందు భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా మాత్రం లివింగ్‌స్టోన్‌ను ఆర్సీబీ వదిలించుకుంటేనే మంచిదని పేర్కొన్న విషయం తెలిసిందే. ఒకవేళ అతడిని తిరిగి కొనుగోలు చేయాలన్న తక్కువ ధరకు లభించే అవకాశం ఉందని పరోక్షంగా వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐపీఎల్‌-2026 మినీ వేలం డిసెంబర్‌ 16న అబుదాబి వేదికగా జరిగే అవకాశముంది.
చదవండి: Ashes: ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం.. 75 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)