Breaking News

సీఎస్‌కే గెలవగానే.. జడేజా భార్య రివాబా ఏం చేసిందంటే? వీడియో వైరల్‌

Published on Tue, 05/30/2023 - 19:33

ఐపీఎల్‌-2023 ఫైనల్‌ మ్యాచ్‌ అభిమానులకు అసలు సిసలైన క్రికెట్‌ మజా అందిం‍చిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌ వేదికగా ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్‌ పోరులో.. 5 వికెట్ల తేడాతో గుజరాత్‌ను ఓడించి సీఎస్‌కే ఛాంపియన్స్‌గా నిలిచింది.

ఆఖరి రెండు బంతుల్లో పది పరుగులు చేయాల్సి ఉండగా.. జడేజా ఓ సిక్స్, ఫోర్ బాది సీఎస్‌కేను ఐదోసారి ఛాంపియన్స్‌గా నిలిపాడు. ఇక ఈ ఫైనల్‌ మ్యాచ్‌ను చూసేందుకు ఇరు జట్ల ఆటగాళ్ల కుటుంబ సభ్యులు కూడా నరేంద్ర మోదీ స్టేడియానికి వచ్చారు. ఇందులో జడేజా భార్య, జామ్ నగర్ నార్త్ ఎమ్మెల్యే రివాబా జడేజా కూడా ఉంది. 

భావోద్వేగానికి లోనైన రివాబా..
ఇక జడేజా చివరి బం‍తికి ఫోరు బాది జట్టును గెలిపించగానే అభిమానులతో పాటు ఆటగాళ్ల కుటంబ సభ్యులు కూడా ఆనందంలో మునిగి తేలిపోయారు. ఈ క్రమంలో స్టాండ్స్‌ నుంచి మ్యాచ్‌ను వీక్షిస్తున్న రివాబా భావోద్వేగానికి లోనయ్యంది. పట్టరాని సంతోషంలో రివాబా కన్నీరు పెట్టుకుంది.

                                      

అనంతరం మైదానంలోకి వచ్చిన ఆమె జడేజా పాదాలకు దండం పెట్టింది. ఆ తర్వాత జడేజాను కౌగిలించుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా మ్యాచ్‌ ప్రజేంటేషన్‌ అనంతరం ఐపీఎల్‌ ట్రోఫీతో జడేజా ఫ్యామిలీ కెమెరాలకు పోజులిచ్చారు. ఆ తర్వాత సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనితో కూడా వీరు ఫోటోలు దిగారు.
చదవండి: ఇటువంటి అద్భుతాలు సర్‌ జడేజా ఒక్కడికే సాధ్యం.. చాలా సంతోషంగా ఉంది: రైనా

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)