Breaking News

జడేజా రాణించినా.. జట్టు మాత్రం ఓటమి

Published on Fri, 01/27/2023 - 15:44

టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా రంజీ ట్రోపీ ద్వారా సూపర్‌ రీఎంట్రీ ఇచ్చినప్పటికి జట్టును మాత్రం ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. ఎలైట్‌ గ్రూప్‌-బిలో భాగంగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్ర 59 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తమిళనాడు రెండో ఇన్నింగ్స్‌లో జడేజా ఏడు వికెట్లతో రాణించిన సంగతి తెలిసిందే. ఓవరాల్‌గా మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లు తీసి రీఎంట్రీ అదుర్స్‌ అనిపించాడు.

అయితే బౌలింగ్‌లో మెరిసిన జడేజా బ్యాటింగ్‌లో మాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 15 పరుగులు చేసిన జడేజా.. రెండో ఇన్నింగ్స్‌లో 25 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టులకు జడేజా ఎంపికైన సంగతి తెలిసిందే.


హార్విక్‌ దేశాయ్‌, సౌరాష్ట్ర క్రికెటర్‌

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే 266 పరుగుల లక్ష్యంతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సౌరాష్ట్ర 206 పరుగులకు ఆలౌటైంది. వికెట్‌ కీపర్‌ హార్విక్‌ దేశాయ్‌ (205 బంతుల్లో 101 పరుగులు) సెంచరీ వృదాగా మారింది. చివర్లో అర్పిత్‌ వసవాడ(45 పరుగులు), రవీంద్ర జడేజా(25 పరుగులు) ఆశలు కలిగించినప్పటికి.. ఇద్దరు స్వల్ప వ్యవధిలో వెనుదిరగడంతో సౌరాష్ట్ర ఓటమి ఖాయమైంది. అంతకముందు తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 324 పరుగులు.. రెండో ఇన్నింగ్స్‌లో జడ్డూ దాటికి 133 పరుగులకే కుప్పకూలింది. సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 192 పరుగులకు ఆలౌట్‌ కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో 206 పరుగులకు ఆలౌట్‌ అయింది.  

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)