Breaking News

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రిటైర్మెంట్‌..?

Published on Sat, 01/17/2026 - 08:47

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇండోర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో రేపు (జనవరి 18) జరుగబోయే నిర్ణయాత్మక మూడో వన్డే తర్వాత టీమిండియాకు అతి భారీ షాక్‌ తగలనుందని తెలుస్తుంది. స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఈ మ్యాచ్‌ తర్వాత వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించనున్నాడని సమాచారం. ఇప్పటికే టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన జడేజా వన్డే కెరీర్‌ భవితవ్యంపై గత కొద్ది రోజులుగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటన్నిటికి మరి కొద్ది గంటల్లో అధికారికంగా తెరపడే అవకాశం ఉంది.

వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలం
ప్రస్తుత న్యూజిలాండ్‌ సిరీస్‌లో జడేజా తొలి రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. తొలి మ్యాచ్‌లో 9 ఓవర్లు వేసి వికెట్‌ లేకుండా 56 పరుగులు సమర్పించుకొని, ఆతర్వాత బ్యాటింగ్‌లో పూర్తిగా తేలిపోయాడు (4 పరుగులు). రెండో వన్డేలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి కొనసాగింది. బ్యాటింగ్‌లో (44 బంతుల్లో 27) కాస్త పర్వాలేదనిపించినా, బౌలింగ్‌లో (8-0-44-0) సీన్‌ రిపీటయ్యింది. అంతకుముందు సౌతాఫ్రికా సిరీస్‌లోనూ జడ్డూ గడ్డు పరిస్థితులనే ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా బంతితో బాగా ఇబ్బంది పడ్డాడు.

ఈ నేపథ్యంలో జడేజాకు వన్డే రిటైర్మెంట్‌పై ఒత్తిడి పెరిగి ఉంటుంది. అతను టెస్ట్‌ల్లో సత్తా చాటుతున్నా వన్డేల్లో సామర్థ్యం మేరకు రాణించలేకపోతున్నాడు. వాస్తవానికి న్యూజిలాండ్‌తో రెండో వన్డేనే జడ్డూకు చివరిదని టాక్‌ నడిచింది. ఎందుకంటే ఆ మ్యాచ్‌కు వేదిక అయిన రాజ్‌కోట్‌ జడేజాకు హోం గ్రౌండ్‌. కానీ, ఆ మ్యాచ్‌ తర్వాత జడేజా ఎలాంటి ‍ప్రకటన చేయలేదు. మూడో వన్డేకు ముందు మరోసారి అతని వన్డే రిటైర్మెంట్‌పై ఊహాగానాలు ఊపందుకున్నాయి.

జడేజా ఫిట్‌గా ఉన్నాడు, ఆటను ఆస్వాదిస్తున్నంతకాలం భారత జట్టుకు ఉపయోగపడతాడని టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ సితాంశు కోటక్‌ తాజాగా కామెంట్‌ చేసినప్పటికీ.. జడేజా వన్డే రిటైర్మెంట్‌పై ఆల్రెడీ డిసైడైపోయాడని ప్రచారం జరుగుతుంది. 37 ఏళ్ల జడేజా ఇప్పటిరకు 209 వన్డేలు ఆడి 2893 పరుగులు చేసి, 232 వికెట్లు తీశాడు. వన్డేల్లో జడేజా స్థానంపై అక్షర్‌ పటేల్‌ ఇదివరకే కర్చీఫ్‌ వేసి ఉంచాడు. జడ్డూ రిటైర్మెంట్‌ తర్వాత అతను వన్డేల్లో రెగ్యులర్‌ సభ్యుడిగా మారిపోయే అవకాశం ఉంది. 

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)