టాప్‌లో బుమ్రా, జడేజా.. దిగజారిన రోహిత్‌ శర్మ ర్యాంక్‌​

Published on Wed, 01/22/2025 - 15:27

ఐసీసీ టెస్టు బౌల‌ర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ పేస‌ర్ జస్ప్రీత్‌ బుమ్రా(jasprith Bumrah) హవా కొనసాగుతున్నాడు. ఐసీసీ తాజాగా ప్ర‌క‌టించిన ర్యాంకింగ్స్‌లో బుమ్రా 904 పాయింట్ల‌తో త‌న అగ్ర‌స్ధానాన్ని మ‌రింత పదిలం చేసుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 సిరీస్‌లో బుమ్రా అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు.

మొత్తం 5 టెస్టుల్లో 13.06 సగటుతో 32 వికెట్లు సాధించి ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా బుమ్రా నిలిచాడు.  ఈ క్ర‌మంలోనే త‌న టెస్టు రేటింగ్ పాయింట్స్‌ను బుమ్రా మెరుగుప‌రుచుకున్నాడు. ఇక బౌల‌ర్ల ర్యాంకింగ్స్‌లో బుమ్రా త‌ర్వాత స్ధానాల్లో వ‌రుస‌గా ఆసీస్ కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్(841), సౌతాఫ్రికా స్టార్ పేస‌ర్ క‌గిసో ర‌బాడ‌(837) కొన‌సాగుతున్నారు.

మ‌రోవైపు ఆల్‌రౌండ‌ర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా(Ravindra jadeja) త‌న అగ్ర‌స్ధానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. జ‌డేజా ఖాతాలో ప్ర‌స్తుతం 400 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో జడేజా పర్వాలేదన్పించాడు. మిగితా ప్లేయ‌ర్ల‌తో పోలిస్తే కాస్త మెరుగ్గానే కన్పించాడు.

ఈ సిరీస్‌లో మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడిన జడ్డూ..  27 సగటుతో 135 పరుగులు చేశాడు. జ‌డేజా త‌ర్వాత స్ధానాల్లో ప్రోటీస్ ఆల్‌రౌండ‌ర్ మార్కో జాన్సెన్ (294), బంగ్లా ప్లేయ‌ర్ మెహిదీ హసన్ (294) నిలిచారు. ఇక బ్యాట‌ర్ల ర్యాంకింగ్స్ విష‌యానికి వ‌స్తే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ(Rohit sharma) ర్యాంక్ మ‌రింత దిగ‌జారింది.

రోహిత్‌ ఒక స్ధానం దిగజారి​ 43వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. బీజీటీ సిరీస్‌లో రోహిత్‌ తీవ్ర నిరాశపరిచాడు. కాగా బీజీటీ సిరీస్‌లో రోహిత్‌ శర్మ తీవ్ర నిరాశపరిచాడు. అటు కెప్టెన్సీ, ఇటు బ్యాటింగ్ ప‌రంగా రోహిత్ శ‌ర్మ పూర్తిగా తేలిపోయాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో కేవ‌లం 31 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్‌ తన ఫామ్‌ను తిరిగి పొందేందుకు పదేళ్ల తర్వాత రంజీల్లో ఆడనున్నాడు.
చదవండి: Ind vs Eng: అతడికి ఇదే చివరి అవకాశం.. ఊపిరి కూడా ఆడనివ్వడు!

Videos

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)