'రెహ్మాన్‌ దకైత్‌' స్టయిల్‌లో ఎంట్రీ ఇచ్చిన రవీంద్ర జడేజా

Published on Tue, 03/10/2026 - 21:09

ఐపీఎల్‌ 2026 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ తమ కొత్త ఆటగాడు రవీంద్ర జడేజాకు ప్రత్యేక స్వాగతం పలి​కింది. ఇటీవల సంచలనం సృష్టించిన బాలీవుడ్ చిత్రం 'ధురంధర్‌'లో అక్షయ్ ఖన్నా పోషించిన ‘రెహ్మాన్ దకైత్’ పాత్రను పోలి ఉండేలా ఓ స్పెషల్‌ వీడియోను రూపొందించి సోషల్‌మీడియాలో రిలీజ్‌ చేసింది. 

84 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో జడేజా సంప్రదాయ రాజస్థానీ వేషధారణలో కనిపించాడు. 'ఖమ్మా ఘనీ, రాజస్థాన్' అంటూ అభిమానులను పలకరించాడు. ఇది ధురంధర్‌ సినిమాలో రెహ్మాన్ దకైత్ 'అస్సలాం వాలేకుం, లియారీ' అన్న సన్నివేశాన్ని గుర్తు చేసింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌మీడియాలో వైరలవుతుంది.

జడేజాను 2026 ఐపీఎల్‌ వేలానికి ముందు రాజస్థాన్‌ రాయల్స్‌ రూ. 14 కోట్లకు సీఎస్‌కే నుంచి ట్రేడ్‌ చేసుకుంది. ఈ మూవ్‌ జడేజాకు హోం కమింగ్‌ లాంటిది. జడ్డూ తన ఐపీఎల్‌ కెరీర్‌ను 2008లో రాజస్థాన్‌ రాయల్స్‌తోనే ప్రారంభించాడు. ఆతర్వాత సీఎస్‌కేతో 12 సీజన్లు, గుజరాత్ లయన్స్‌తో 2 సీజన్లు ఆడి తిరిగి రాయల్స్‌ గూటికే చేరాడు.  

2008లో షేన్ వార్న్ నేతృత్వంలో రాయల్స్‌ తొలి ఐపీఎల్‌ టైటిల్ గెలిచినప్పుడు జడేజా కీలక సభ్యుడు. రెండు సీజన్ల పాటు రాయల్స్‌కు ప్రాతినిథ్యం​ వహించిన జడ్డూ.. 22 ఇన్నింగ్స్‌ల్లో 430 పరుగులు చేసి, 6 వికెట్లు తీశాడు.  

ప్రస్తుత రాయల్స్‌ జట్టు జడేజా చేరికతో మరింత బలపడింది. సంజూ శాంసన్‌ రాయల్స్‌ను వీడటంతో ఈ సీజన్‌తో రియాన్‌ పరాగ్‌ ఫుల్‌టైమ్‌ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. జడేజాతో పాటు ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కర్రన్‌ కూడా సీఎస్‌కే నుంచి రాయల్స్‌కు ట్రేడ్‌ అయ్యాడు. మరో ఆల్‌రౌండర్‌ డొనొవన్‌ ఫెరియెరా ఢిల్లీ క్యాపిటల్స్‌ నుంచి రాయల్స్‌లోకి వచ్చాడు.

అప్పటికే యశస్వి జైస్వాల్‌, వైభవ్‌ సూర్యవంశీ, షిమ్రోన్‌ హెట్‌మైర్‌, లుహాన్‌ డ్రి ప్రిటోరియస్‌, ధృవ్‌ జురెల్‌, రియాన్‌ పరాగ్‌ లాంటి విధ్వంసకర వీరులతో రాయల్స్‌ బ్యాటింగ్‌ విభాగం కలకలలాడుతుండింది. జోఫ్రా ఆర్చర్‌, నండ్రే బర్గర్‌, రవి బిష్ణోయ్‌, సందీప్‌ శర్మ, క్వేనా మఫాకా లాంటి బౌలర్లతో సమతూకంగా ఉంది. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)