Breaking News

నాకైతే ఆడాలని ఉంది.. కానీ అది నా చేతుల్లో లేదు: జడేజా

Published on Sat, 10/11/2025 - 20:24

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు చోటు దక్కకపోయిన సంగతి తెలిసిందే. జడ్డూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికి సెలక్టర్లు అతడిని పరిగణలోకి తీసుకోకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది.

గతేడాది టీ20లకు వీడ్కోలు పలికిన జడేజా.. ప్రస్తుతం వన్డే, టెస్టు ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు.  2009 నుంచి భారత్ తరఫున వన్డే క్రికెట్ ఆడుతున్న జడేజా  అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా నిలిచాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకోవడంలోనూ అతడు కీలక పాత్ర పోషించాడు.

ప్రస్తుతం విండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనూ ఈ సౌరాష్ట్ర క్రికెటర్ అదరగొడుతున్నాడు. ఫిట్‌నెస్ పరంగా కూడా అతడు చాలా మెరుగ్గా ఉన్నాడు.  ఆసీస్ సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంతో వన్డే ప్రపంచ కప్‌-2027లో జడేజా ఆడుతాడో లేదో సందిగ్ధంగా మారింది. అయితే బీసీసీఐ చీఫ్ సెలక్టర్ మాత్రం జడేజా తమ ప్రణాళిలకలలో ఉన్నాడని జట్టు ప్రకటన సందర్భంగా చెప్పుకొచ్చాడు. తాజాగా జడేజా కూడా ప్రపంచకప్‌లో ఆడాలన్న తన కోరికను వ్యక్తం చేశాడు.

"వన్డే ప్రపంచ కప్‌-2027లో ఆడాలనుకుంటున్నాను. కానీ అది నా చేతుల్లో లేదు. సెల‌క్ష‌న్ క‌మిటీ నిర్ణ‌యంపై ఆధార‌ప‌డి ఉంటుంది. ఆసీస్ టూర్‌కు జ‌ట్టు ఎంపిక‌కు ముందు సెల‌క్ట‌ర్లు, కెప్టెన్ నాతో మాట్లాడారు. వారి చెప్పిన కార‌ణాలు నాకు అర్థమయ్యాయి. కానీ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ గెల‌వ‌డం మా అంద‌రి క‌ల" అని జ‌డేజా విలేక‌రుల స‌మావేశంలో పేర్కొన్నాడు.
చదవండి: అది నేను ఎప్పటికీ మర్చిపోలేను: గంభీర్‌

 

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)