Breaking News

ప్రపంచ నెంబర్‌ వన్‌ టెస్ట్‌ బౌలర్‌గా రవిచంద్రన్‌ అశ్విన్‌..

Published on Wed, 03/13/2024 - 17:01

టెస్టు క్రికెట్‌లో వరల్డ్‌ నెంబర్‌ వన్‌ బౌలర్‌గా మరోసారి టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌  నిలిచాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అశ్విన్‌ అగ్రస్ధానానికి చేరుకున్నాడు. ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన అశ్విన్... టీమిండియా పేస్‌ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను వెనక్కినెట్టి  టాప్‌ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు.

కాగా అశ్విన్‌ తన కెరీర్‌లో ఫస్ట్‌ ర్యాంక్‌ను సాధించడం ఇది ఆరోసారి. 2015 డిసెంబర్‌లో తొలిసారి టాప్‌ ర్యాంక్‌ను అశూ సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌ సిరీస్‌లో అశ్విన్‌ తన స్పిన్‌ మయాజాలన్ని ప్రదర్శించాడు. ఓవరాల్‌గా ఈ ఐదు టెస్టుల సిరీస్ లో 26 వికెట్లు పడగొట్టిన అశ్విన్‌..  లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు.

అశ్విన్‌తో పాటు ఈ సిరీస్‌లో సంచలన ప్రదర్శన కనబరిచిన కుల్దీప్‌ యాదవ్‌ తన కెరీర్‌లో బెస్ట్‌ ర్యాంక్‌ను పొందాడు. కుల్దీప్‌ 15 స్థానాలు ఎగబాకి 16వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇక ఇప్పటివరకు టాప్‌ ర్యాంక్‌లో కొనసాగిన బుమ్రా.. మూడో స్ధానానికి పడిపోయాడు.  న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో సత్తాచాటిన హేజిల్‌వుడ్ రెండో స్థానానికి ఎగబాకాడు.
చదవండి: ICC Test Rankings: సత్తాచాటిన రోహిత్‌ శర్మ, జైశ్వాల్‌.. టాప్‌ 10 లోకి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)