Breaking News

IND vs NZ 2nd Test: అశ్విన్‌ మ్యాజిక్.. కెప్టెన్‌ ఔట్‌

Published on Thu, 10/24/2024 - 11:21

పూణే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఎనిమిదో ఓవర్‌లోనే తొలి వికెట్‌ కోల్పోయింది. అశ్విన్‌ మ్యాజిక్‌ డెలివరీతో కివీస్‌ కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ను (15) ఎల్బీడబ్ల్యూ చేశాడు. అశ్విన్‌ బంతిని అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైన లాథమ్‌ వికెట్ల ముందు సులువుగా దొరికిపోయాడు.

ఇన్నింగ్స్‌ 24వ ఓవర్‌లో అశ్విన్‌ మరోసారి మ్యాజిక్‌ చేశాడు. ఈసారి యాష్‌ విల్‌ యంగ్‌ను (18) బోల్తా కొట్టించాడు. వికెట్ల వెనుక పంత్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో యంగ్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. 24 ఓవర్ల అనంతరం న్యూజిలాండ్‌ స్కోర్‌ 76/2గా ఉంది. డెవాన్‌ కాన్వే (38), రచిన్‌ రవీంద్ర క్రీజ్‌లో ఉన్నారు.

కాగా, ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ టాస్‌ గెలిచి టీమిండియాను బౌలింగ్‌కు ఆహ్వానించింది. తొలుత బౌలింగ్‌ చేస్తున్న భారత్‌ 76 పరుగులకే రెండు వికెట్లు తీసి న్యూజిలాండ్‌ను డిఫెన్స్‌లోకి నెట్టేసింది. 

ఈ మ్యాచ్‌ కోసం భారత్‌ మూడు మార్పులు చేసింది. కేఎల్‌ రాహుల్‌, కుల్దీప్‌ యాదవ్‌, మొహమ్మద్‌ సిరాజ్‌ స్థానాల్లో శుభ్‌మన్‌ గిల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఆకాశ్‌దీప్‌ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు న్యూజిలాండ్‌ సైతం  నేటి మ్యాచ్‌ కోసం ఓ మార్పు చేసింది. పేసర్‌ మ్యాట్‌ హెన్రీ స్థానంలో మిచెల్‌ సాంట్నర్‌ తుది జట్టులోకి వచ్చాడు.  

తుది జట్లు..
భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్‌కీపర్‌), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా

న్యూజిలాండ్: టామ్ లాథమ్(కెప్టెన్‌), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(వికెట్‌కీపింగ్‌), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కే

చదవండి: ఆరేసిన రబాడ.. సౌతాఫ్రికా టార్గెట్‌ 106
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి