Breaking News

అందుకే ఐపీఎల్‌ నుంచి తప్పుకొన్నా.. ధోని మాత్రం గ్రేట్‌: అశ్విన్‌

Published on Fri, 08/29/2025 - 11:18

టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్‌.. ఇప్పుడు ఐపీఎల్ నుంచి కూడా తప్పుకొని అందరికి షాకిచ్చాడు. ఐపీఎల్‌-2025 ఎడిషన్‌లో సూపర్ కింగ్స్ (CSK) తరపున చివరిసారిగా ఆడిన అశ్విన్, ఇకపై విదేశీ లీగ్‌లలో ఆడేందుకు సిద్దంగా ఉన్నట్లు వెల్లడించాడు. 

వచ్చే ఏడాది ఇంగ్లండ్‌కు చెందిన ది హాండ్రడ్ లీగ్‌లో అశూ భాగమయ్యే అవకాశముంది. ఇక  ఐపీఎల్ నుంచి రిటైర్ కావాలనే తన ఆకస్మిక నిర్ణయానికి గల కారణాన్ని అశ్విన్ తాజాగా వెల్లడించాడు. దాదాపు మూడు నెలల పాటు కంటిన్యూగా క్రికెట్ ఆడేందుకు తను సిద్దంగా లేనందున ఐపీఎల్ నుంచి తప్పుకొన్నట్లు తెలిపాడు. అదేవిధంగా 44 ఏళ్ల వయస్సులోనూ ఐపీఎల్‌లో ఆడుతున్న ధోనిను అశ్విన్ ప్రశంసించాడు.

"వచ్చే ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో ఆడాలని తొలుత నిర్ణయించుకున్నాను. కానీ మూడు నెలల పాటు క్రికెట్‌ అంటే కొంచెం కష్టంగా అన్పించింది. అందుకు నా శరీరం సహకరించదని అనుకుంటున్నాను. ఐపీఎల్‌ నుంచి తప్పుకోవడానికి ఇదే ప్రధాన కారణం.

ధోని మాత్రం నిజంగా గ్రేట్‌. అతడి ఫిట్‌నెస్‌ చూసి నేను ఎప్పుడూ ఆశ్యర్యపోతుంటాను. వయస్సు పెరుగుతున్న కొద్ది ఐపీఎల్‌ వంటి టీ20 లీగ్‌లో ఆడడం అంత సులువు కాదు. దాదాపు మూడు నెలల పాటు అందుకు కేటాయించాల్సి వుంటుంది.

దేశ వ్యాప్తంగా ప్రయాణం చేస్తూ మ్యాచ్‌లు ఆడాలి. ఒక మ్యాచ్‌ తర్వాత మరొక మ్యాచ్‌కు సిద్దంగా ఉండాలి. కొన్ని సార్లు ఒకట్రెండు రోజుల వ్యవధిలోనే మ్యాచ్‌ ఆడాల్సి వస్తుంది. అందుకు మన శరీరం సహకరించాలి అని తన యూట్యూబ్‌ ఛానల్‌లలో అశ్విన్‌ పేర్కొన్నాడు.

అశ్విన్‌ తన కెరీర్‌లో మొత్తంగా 221 ఐపీఎల్ మ్యాచ్‌ల‌లో 187 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అంతేకాకుండా బ్యాటింగ్‌లో కూడా 833 ప‌రుగులు సాధించాడు. 38 ఏళ్ల అశ్విన్ ఐపీఎల్‌లో ఐదు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. సీఎస్‌కే, రైజింగ్  పూణే సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ త‌ర‌పున ఆడాడు.
చదవండి: Danish Malewar: డ‌బుల్ సెంచ‌రీతో చెల‌రేగిన యువ సంచలనం.. తొలి ప్లేయర్‌గా రికార్డు

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)